BHARATHADESAMLO CORPORATE MIDHYA by GOPI Telugu book cover

BHARATHADESAMLO CORPORATE MIDHYA

by GOPI

₹20
In stock · 3 available
PublisherGOPI
LanguageTelugu
| ఒక్క మాట! | ఈ పుస్తకాన్ని 4 నెలల క్రితం గోపీ అని పిలవబడే సజ్జా గోపాలరావు ప్రచురించాడు. అతని పాఠశాల విద్య 5-6 తరగతులకు మించి సాగలేదు. ఫక్తు రైతుబిడ్డ. అయితే దివి తాలూకా గ్రామీణ పేదల సంఘం కార్యకలాపాలకు ఆకర్షితుడై ఉద్యమ కార్యకర్తగా ఎదిగాడు. జీవితాన్ని చదవటమనే కళను అలవరచుకున్నాడు. రాజకీయ గ్రంథాల కంటే సామాజిక వాస్తవాలను గ్రహింపజేసే సాహిత్య గ్రంథ పఠనాన్ని ఎక్కువ సాగించాడు. 'ప్రజాసాహితి' పత్రికను గడిచిన 40 ఏళ్ళుగా క్రమం తప్పకుండా చదువుతున్నాడు. ప్రస్తుతం రైతుకూలీసంఘం కృష్ణాజిల్లా కమిటీ సభ్యునిగా తన వంతు కృషి చేస్తున్నాడు. జీవితంలోని అసమానతలమీదా, సమాజంలోని అభివృద్ధి నిరోధక భావజాల కాలుష్యం మీదా, పాలకవర్గ రాజకీయ వంచన మీదా, వామపక్ష శక్తుల అనైక్యత మీదా తీవ్రమైన అసంతృప్తి, ఆవేదన చెందే గోపీకి, విద్యావిధానం పేరిట బాల్యాన్ని ఛిద్రం చేస్తున్న మన చదువుల మీద కూడా ఆగ్రహం వుంది. ఈ క్రమంలో పత్రికలలో వచ్చిన “ఫిన్లాండ్ విద్య" పై వ్యాసాలు అతడిని ఆకర్షించాయి. మన పాలకులు అనుసరిస్తున్న విద్యావిధానపు డొల్లతనం మరింత ప్రస్పుటమైంది. దాన్ని పదిమందికీ తెలియపర్చాలన్న ఆలోచనతో, ఉత్సాహంతో ఈ పుస్తకాన్ని వెలువరించాడు. దీనిపై 'ప్రజాశక్తి' తదితర పత్రికలలో సమీక్షలొచ్చాయి. ప్రశంసలతో కూడిన కొత్త కంఠాలు పలుకరించాయి. బంధువులు, మిత్రులు కూడా ప్రోత్సహించగా దీన్ని రెండవ ముద్రణగా విడుదల చేస్తున్నారు. మొదటి ముద్రణలోని కొన్నిటిని తగ్గించి, మరికొన్ని జోడించి ఈ ముద్రణ వెలువడుతోంది. నేటి విద్యా విధానం, భాషాబోధనా విధానం గురించి ఆలోచించేవారందరినీ యిది ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము....