
BHARATHADESAMLO KULA SAMASYA
by MALUPU BOOKS
₹120
In stock · 7 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076008
భారతదేశంలో కులాలు ఒక ఆందోళన కలిగించే వాస్తవం. కొందరు అవి ఎన్నటికీ పోవని భావిస్తే, మరికొందరు అదొక సమస్యేకాదని అసలు పట్టించుకోరు. తత్ఫలితంగా కులాలు లక్షలాది ప్రజల జీవితాలను సంక్షోభానికి గురిచేస్తూ, పాలకవర్గాల అధికార పునాదులను బలోపేతం చేస్తూ కొనసాగుతున్నాయి. కుల నిర్మూలనపై దృష్టిని కేంద్రీకరిస్తే వాటిని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కామ్రేడ్ అనూరాధ గాంధీ రాసిన “భారతదేశంలో కుల సమస్య” వ్యాసం ఈ కోవలోకే వస్తుంది. ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిగా, ఆ తరువాత ఒక విప్లవ కార్యకర్తగా కామ్రేడ్ అనూరాధ కులాలపై చేసిన అధ్యయనం ఇందులో సమున్నతంగా ఆవిష్కృతమయింది. కులాల మూలాలకు సంబంధించిన సిద్ధాంతాలూ, చరిత్రలో కులాల అభివృద్ధికి సంబంధించిన ముఖ్యాంశాలూ మొదలుకుని కుల నిర్మూలనకు ఒక ఆచరణాత్మక కార్యాచరణను రూపొందించే వరకూ కుల వ్యవస్థను ఆమె సమగ్రంగా సమీక్షించారు.