BHARATHAM - PILLALA BOMMALA by SWATHI BOOK HOUSE Telugu book cover

BHARATHAM - PILLALA BOMMALA

by SWATHI BOOK HOUSE

₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812010
భారతం పూర్వం భారతదేశాన్ని సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు పరిపాలించారు. చంద్రవంశ రాజుల్లో యయాతి చాలా ప్రముఖమైనవాడు. దుష్యంతుడు, శకుంతలకు పుట్టిన కుమారుడు భరతుడు. కురురాజు కూడా ఈ వంశంలోని వాడే. కురురాజు వంశస్థులు హస్తినాపురాన్ని తమ రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించారు. భీష్ముడు కురురాజ వంశంలో భరతుడి తరువాత అంత ప్రాచుర్యం పొందిన రాజు శంతనుడు. శంతనుడు ఒకసారి గంగానది తీరంలో వేటకు వెళ్ళాడు. అక్కడ గంగానది మానవ రూపంలో శంతనుడి ముందు ప్రత్యక్షమయింది. మనిషి రూపంలో ప్రత్యక్షమయిన గంగని చూసి శంతనుడు ఆమె ప్రేమలో పడ్డాడు. తన ప్రేమను వెంటనే ఆమెకు తెలియజేశాడు. అప్పుడు గంగ, "శంతనా ! ఓ షరతుకు లోబడి వుండినట్లయితే నేను నీతో వుండటానికి అంగీకరిస్తాను. నేను చేసే ఏ పనికి 'కాదు' అని నువ్వు చెప్పకూడదు.