BHARATHAMLO UPAKYANAMU -30 by DR.D.V.RAMANAMMA Telugu book cover

BHARATHAMLO UPAKYANAMU -30

by DR.D.V.RAMANAMMA

₹30
In stock · 7 available
PublisherDR.D.V.RAMANAMMA
LanguageTelugu
నా మాట “వింటే భారతం వినాల”న్నది జనసూక్తి. మహాభారతంలో చంద్రవంశపు రాజగాధలు, కౌరవపాండవుల కథ ముఖ్యమైనవి. ధర్మగ్లాని కలిగిన సందర్భములలో అధర్మాన్ని నిర్మూలించి పునః ధర్మస్థాపన చేయడం శ్రీకృష్ణావతార ప్రయోజనమని అందరికీ తెలుసు. మహాభారత చరిత్రలో ధర్మ మార్గదర్శకులుగా నిలచిన మహనీయులు శ్రీకృష్ణుడు, భగవాన్ శ్రీ బాదరాయణుడు శ్రీ వేదవ్యాసుడు, విదురుడు, ధర్మరాజు ముఖ్యులు. ఎన్ని కష్టాలనో ఓర్చి నిలబడిన ధర్మరాజాదులకు అడుగడుగునా ధర్మ మార్గంలో నడిచే వారికి కష్టాలు పరీక్షలుగా వస్తూడడం క్రొత్త ఏమీ కాదనీ, ఇలాగే అంతకు ముందు జరిగిన సంఘటనలలోని ధర్మ నిరతుల జీవితగాధలను ఉటంకిస్తూ పాండు నందనులను ప్రోత్సహిస్తూ ఎందరో మహర్షులు చెప్పిన కథలు ఈ ఉపాఖ్యానాలుగా గతంలో చదువరులకందించేను. ఇవి ఒకప్పుడు "జాగృతి" వారపత్రికలో కొన్ని వారాలపాటు ప్రచురిత మయ్యాయి. "భారతంలో ఉపాఖ్యానములు" అనే పుస్తకరూపంలో వీటిని తీసుకురావాలని మా కుమారుడు చి. రాజకిశోర్, మా శ్రీవారు ఆచార్య దుగ్గిరాల విశ్వేశ్వరం గారు సంకల్పించారు. ముందుగా ఈ కథలన్నీ చదివి నాకు ఆశీస్సు లందించిన మా రజనీ (కళాప్రపూర్ణ డా|| బాలాంత్రపు రజనీకాంతరావు) అన్నయ్యకు నా నమస్సుమాంజలులు. "భారతంలో ఉపాఖ్యానములు" సమగ్రంగా పరిశీలించి నాపై అభిమానంతో చక్కని విశ్లేషణా పూర్వకమైన అభినందనలు కురిపించిన ఆచార్య శ్రీమతి మలయవాసిని గారికి కృతజ్ఞతలు. సర్వాంగ సుందరంగా ఈ పుస్తకాన్ని ముద్రించి పెట్టిన ముద్రికా ప్రింటర్స్ వారికి, ప్రచురణ కర్తలైన శిక్షణ మండల్ ప్రకాశకులకు హార్ధిక ధన్యవాదములు.