
BHARATHEEYA NASTHIKAVADAM
by DR.DEVIPRASAD CHATOPADHYAYA - DR.RENTALA SRI VENKATESWARA RAO
₹300
In stock · 148 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400958
తెలుగులో తత్వశాస్త్రంమీద వచ్చిన రచనలు చాలా తక్కువ. మతశాస్త్రం (థియోలజీ) మీద కూడా రాలేదు. మతం పేరుతో వచ్చాయి. ఇతిహాసాలమీదా పురాణాలమీదా అసంఖ్యాకంగా వస్తూనే ఉన్నాయి. కానీ శాస్త్రీయమైన రచనలు అనదగ్గవి బహుతక్కువ. అందుచేత, 'భారతీయ నాస్తికవాదం' చదవాల్సిన రచన. నాస్తికతా ధోరణుల్ని వివరించడమే కాక, ఇన్ని నాస్తికశాఖలూ, ఇందరు పండితులూ ఉండి కూడా ఎందుకు సమాజం ఇప్పటికీ మతం పట్టులో ఉండిపోయింది అన్న ప్రశ్నకి ఆలోచనా పూర్వకమైన సమాధానాన్ని కూడా ఇచ్చింది ఈ రచన. నిజానికి ఇది చదవాల్సిన పుస్తకం కాదు. అధ్యయనం చెయ్యాల్సిన పుస్తకం. మెదడుకు శాస్త్రీయమైన ఆలోచనావిధానాన్ని మప్పడంకోసం అయినా అధ్యయనం చెయ్యాల్సిన పుస్తకం. భగవంతుడున్నాడని ఆస్తికులు, లేడని నాస్తికులు చెప్పిన రుజువుల్ని, వాదనల్ని, ఖండన భండనల్ని చదవడం బుద్ధికి శిక్షణ. దేవీప్రసాద్ చటోపాధ్యాయ (1918-93) పేరెన్నికగన్న మార్క్సిస్టు తత్వవేత్త. ప్రాచీన భారతదేశంలో విజ్ఞానశాస్త్రం గురించి, తత్వశాస్త్రం గురించి, అరుదైన పరిశోధనలు జరిపిన మేధావి. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. డా॥ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు కవిగా, విమర్శకుడిగా, వక్తగా, అనువాదకుడిగా తెలుగు పాఠకులకు సుపరిచితులు. విశేషించి గజల్ రచయితగా ప్రసిద్ధులు. ఇప్పటివరకూ సుమారు 4000 పుటల అనువాద రచనలు ఇచ్చిన కలం వారిది.