BHARATHEEYA SAMSKRUTHI - 45.00 by YETUKURU BALARAMAMURTHY Telugu book cover

BHARATHEEYA SAMSKRUTHI - 45.00

by YETUKURU BALARAMAMURTHY

₹45
In stock · 3 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
భారతీయ సంస్కృతి వాస్తవ ప్రపంచం నిరంతర పరిణామశీలం. ఇందుకు కారణం అంతరంగిక వమాత్రాలు, బాహ్యమైన ఆదేశక సూత్రాలు కావు. ఈ మార్పు కొన్ని నిర్దిష్ట నియమాల ననుసరిస్తుంది. కనుక ఈ మార్పును చేసుకొవచ్చు, విశ్లేషించనూవచ్చు. ఒక మేరకు భవిష్యత్ పరిణామాన్ని ఉహించవచ్చు కూడా. వాస్తవికత రెండు రకాలు. ఒకటి వస్తుగతం, రెండోది చైతన్యాత్మకం, ప్రకృతి, సమాజం మొదటి తరహా వాస్తవికతకు చిహ్నాలు. మానవుని ఆలోచన, వారి అభివృద్ధి రెండో తరహాకు ఉదాహరణ. ఇచ్చితంగా చెప్పాలంటే సామాజిక పరిణామానికి రెండు పార్శ్వాలూ ఉన్నాయి. దీర్ఘ కాల పరిణామ దశల దృష్ట్యా ఆర్థిక కారణాలు, అనగా వస్తుగత వాభవాలు మౌలికమైనప్పటికీ, స్వల్పకాల పరిణామాలపై చైతన్యాత్మక తర్కం, నాయకత్వ పాత్ర నిర్వహిస్తున్న శక్తుల ప్రభావం గణనీయంగా గతి ప్రతి స్వల్పకాలిక దశను తిరిగి ఉపదశలుగా విభజించివచ్చు. ప్రతి ఉప భరలోను చైతన్య పూర్వక పాత్ర ఘటనా కార్యక్రమాన్ని ముందుకు, లేక వెన మ నడిపించటంలో ప్రముఖస్థానం ఆక్రమిస్తుంది. ఆ కాలపు భావజాలం, మతం, తత్వశాస్త్రం, ప్రముఖ నాయకులు వారి ప్రభావం - ఇవన్నీ చైతన్య చైతన్యపూర్వక పాత్రలో అంతర్భాగాలు, ఈ భావస్రవంతులు సైతం, దరహంమీదసామాజిక, ఆర్థిక, నాజకీ.కు కారణాల ఫలితంగా రూపొందినవే. ఒకసారి ఆవిర్భవించిన మీదట ఈ మానసిక ప్రభావాలు, భౌతిక శక్తులవలె పనిచేస్తాయి. సామాజిక పరిణామంపై చర్య, ప్రతిచర్యలను కలిగిస్తాయి. ప్రకృతిలోని పరిణామాన్ని అధ్యయనం చేయాలంటే, వివిధ భౌతికశాస్త్ర, విభాగాలు గణనీయమైన స్థాయికి అభివృద్ది చెంది ఉండాలి. ప్రాచీన కాలంలో ఈ అభివృద్ధి అంతగా జరగలేదు. ఖగోళిక శాస్త్రం, గణిత శాస్త్రం అభివృద్ధి చెందినా, భౌతిక, రసాయన శాస్త్రలు వృద్ధి కాలేదు. కనుక ప్రకృతిలోని తార్కి క్రమాన్ని అర్థం చేసుకోవటం ఆనాడు అసంభవంగా ఉండేది.