BHARATHIYA CHITRA KALA by TALISETTY RAMA RAO Telugu book cover

BHARATHIYA CHITRA KALA

by TALISETTY RAMA RAO

₹80
In stock · 33 available
PublisherTALISETTY RAMA RAO
LanguageTelugu
ఒక్కమాట మన ఆంధ్రదేశమున జాతీయచిత్రకళ ప్రాముఖ్యము వహించుచుండుటవలన రవివర్మ చిత్రములవలనను, పాశ్చాత్యవిద్యవలనను, వ్యాపించిన ఐరోపా చిత్రరచనావ్యామోహము తగ్గజొచ్చినది. ఇట్టియదనున ప్రాచీనకాలము నుండి భారతదేశమున చిత్రకళ పొందిన మార్పులను, దానియాధిక్యమును తెలుపు చరిత్ర ప్రజలకంద జేసినయెడల నీప్రబోధమునకు లాభము చేకూరునను నాశతో నే నీచిన్న గ్రంథమును వ్రాసితిని. ఈ గ్రంథమును వ్రాయుటయందు “పెర్సీబ్రౌను” గారి 'భారతీయవర్ణ లేపనము'ను, ‘విన్సెంటుస్మిత్తు’గారి 'హిందూసింహళ దేశములందలి లలితకళ యొక్క చరిత్ర'ను, ఆధారముగ గొంటిని. మొదటిప్రకరణమున కృష్ణా పత్రికాధిపతులు ప్రకటించిన 'సంక్రాంతి' సంచికయు తోడయ్యెను. ఈ గ్రంథకర్త లందఱికి నా వందనములు. ఇట్టి గ్రంథములను కొనువా రరుదు కాన ప్రకటించువారును అరుదు. విదుమిక్కిలి సచిత్రముగ ప్రకటింపవలసినదగుటచే వ్యయమును అధికముగ నగును. కావున గ్రంథప్రకాశకులు దీనిని ముద్రించి ప్రకటించుటకు వెనుదీయుట సహజము. శ్రీ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు రాజకీయసాంఘికాదులగు ఉద్యమములకు నాయకులై వానికి ప్రోత్సాహము నొసగుచు ఆంధ్రులయౌన్నత్యముకొఱ కెంతయైన త్యాగము జేయుచున్నవా రనుట క్రొత్త కాదు. నేను ఈ నా చిన్న గ్రంథమును వారి కర్పించి దానిని వారిని స్వయముగ చదువగోరితిని. వారును, నాకోరిక ననుసరించి దాని నామూలాగ్రము చదివి తమ 'ఆంధ్రగ్రంథమాల'యందు ప్రచురించుట కంగీకరించి యచిర కాలముననే ఇట్లు ముద్రింపించి వెలువరించిరి. వ్యయమునకు వెనుదీయక త్రివర్ణ చిత్రములతోను, పెక్కు ఏకవర్ణ చిత్రములతోను, ఇట్లు సుందరరూపమున వెలువరించిన యీపుస్తకము శ్రీ పంతులుగారి కళాపోషణపరాయణతకు గట్టి నిదర్శనము. ఇట్లు నాప్రయాసమును సఫలముగావించిన శ్రీపంతులు గారికి కృతజ్ఞతాపూర్వకములగు నావందన సహస్రములు. ఇంకను జాతీయచిత్రరచన యెడల విముఖులైయున్న యాంధ్రులను కొందఱినైనను ఈగ్రంథము సుముఖులను జేయగలిగినయెడల నేను కృతార్థుడ నగుదును. గ్రంథముద్రణానంతరము భారతీయ చిత్రకళాచరిత్రయందు, కొన్నినూతనాంశములు వెల్లడియైనవి. వానిని పునర్ముద్రణమున జేర్చుకొందును.