
BHARATHIYA SABHA MARYADALU
₹40
In stock · 13 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
చట్టసభలు-నైతిక విలువలు డా.జి.వి.పూర్ణచందు సభా కల్పతరుం వందే వేద శాఖోపజీవనం శాస్త్రపుష్ప సమయక్తం విధ్వదృమర శోభితం వేదాలనే కొమ్మలతో, శాస్త్రాలనే పుష్పాలతో, విద్వాంసులనే తుమ్మెదలతో ప్రకాశించే "సభ” అనే కల్ప వృక్షానికి నమస్కరించాడు వేద కాలం నాటి మానవుడు. సభ పవిత్రతకు ఈ ప్రార్ధన నిలువెత్తు సాక్ష్యం. “మీటింగ్” అనే పదం 'సభ' కు సాటిరాగల పదం కాదు. 'సభ' ఎంతో లోతైన, విస్తృతార్ధం కలిగివుంది. సభ అంటే ప్రజాస్వామ్యమే! సభ సమానార్థకం కాదు. ఋగ్వేదకాలం నుండీ సభ అనేది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కట్టుబడిన ఒక వ్యవస్థ. దాన్ని నిర్వహించటాన్ని నూరు యజ్ఞాలకన్నా పుణ్యకార్యంగానే ఆనాటి మేథావులు పరిగణించారు. చట్టసభ, న్యాయసభ, శాస్త్రసభ ఇలా ఏ సభయినా విస్తృతమైన చర్చ జరిగే వేదికగా అది ఆదినుండీ పవిత్రమైనదే! సభ వలన నిజం నిగ్గు తేలుతుంది. సభ వలన వ్యక్తులు మర్యాదా పురుషోత్తము లౌతారు. సభ వలన సమాజం రాణిస్తుంది. అందుకే సభ పవిత్రమైనది. దాని పవిత్రతను నిలబెట్టవలసిన బాధ్యత సభాసదులపైన ఉంటుంది. సమాజం పైన కూడా ఉంటుంది. నైతిక విలువలు మంట గలిసిపోతున్న ఈ రోజుల్లో సభ ఒన గూర్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సభని జరగనివ్వటమే ముందుగా జరగవలసి ఉంది. వేదాలు చెప్పింది ఇదే... మహావీరుడు చెప్పిందీ ఇదే...