BHARATHPAI ARUNATARA by MALUPU BOOKS Telugu book cover

BHARATHPAI ARUNATARA

by MALUPU BOOKS

₹100
In stock · 3 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
భారత్లో ప్రస్తుత అంతర్యుద్ధం "భారతదేశం పేద ప్రజల దేశం. కాని అది పేద దేశం కాదు." - రజనీ పామీ దత్, ఇండియా టుడే, 1940 హిందుస్తాన్ టైమ్స్ పత్రిక రాసింది అక్షరాలా నిజం. భారతదేశంలో ఒక అంతర్యుద్ధం సాగుతున్నది. ఈ యుద్ధం 1967 నక్సల్బరీ ప్రజ్వలనంతో మొదలై అభివృద్ధి చెందుతూ వస్తున్నది. అదేమీ ఆశ్చర్యం కాదు. ఒకవైపు స్థూల జాతీయోత్పత్తి సాలీనా 8 శాతం పెరుగుతూ ఉంది. మరొకవైపు 110 కోట్ల భారత జనాభాలో 55 శాతం మంది, లేదా 64 కోట్ల మంది పేదరికంలో ఉన్నారని ఇటీవలి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం చూపింది. ప్రపంచంలోని మొత్తం పేదలలో మూడో వంతు భారత్ లోనే ఉన్నారు. అన్నార్తులు మరింత ఆకలికి గురి అవుతున్నారు. అంతర్జాతీయ ఆకలి సూచికలో భారత దేశం సహారా ఎడారి దేశాల కన్న దిగువన ఉంది. భారత్ లోని ఆరు రాష్ట్రాలలో 42 కోట్ల మంది పేదలుండగా, 26 అతి పేద ఆఫ్రికన్ దేశాలలో కలిసి 41 కోట్ల మంది పేదలున్నారు. ఇది అంతర్యుద్ధమని భారత ప్రభుత్వం అధికారికంగా అంగీకరించదు. అది తక్కువ స్థాయి ఘర్షణ (లో ఇంటెన్సిటీ కాన్ఫిక్) అనే మాట ఎంచుకుంటుంది. ఈ మాటను బ్రిటిష్ సైనికాధికారి సర్ ఫ్రాంక్ ఎడ్వర్డ్ కిట్సన్ మొదట వాడాడు. కెన్యాలో మౌమౌ ఉద్యమకారులను, మలేషియాలో తిరుగుబాటుదారులను, ఉత్తర ఐర్లాండ్లో ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ విప్లవకారులను అణచివేసిన అనుభవం నుంచి ఆయన ఆ మాట వాడాడు.