
BHARATIYA VAJNANA THOMMIDI ANKE PRASTHAVANA
₹369
In stock · 5 available
PublisherC.VENKATA SUBBA REDDY
LanguageTelugu
ముందుమాట బ్రహ్మ స్వరూపము మార్పులకు అతీతము, కనుక తొమ్మిది అంకెచేత సూచించబడినది. అందుచేత 9 అంకెను ప్రస్తావనగా తీసుకున్నాను. ఈ సృష్టి క్రమమంతా జీవుడు, దేవునితో ముడిపడి యున్నదని తెలుసుకొనుటకు జీవుడు, దేవుడు ఒకటేనని వేరు వేరు కాదని చూపించుటకు ఒక సంకల్పము నాకు తట్టినది. దానిని తెలుసుకొనుటకు ఉపనిషత్తులలో మొదటిదైన ఈశావాస్యోపనిషత్తులోని మొదటి మంత్రము "ఓం పూర్ణమదః ఓం పూర్ణమిదః" అను దాని ద్వారా నిశ్చయము చేయుటకుగాను మొదటి పూర్ణముతో సృష్టి ప్రారంభమై 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే జగత్ పుట్టి మరల పూర్ణములోనే లయమగుచున్నది. అనగా 9 తరువాత వచ్చే శూన్యములో అనగా పూర్ణముతో కలసిపోవుచున్నది. శూన్యమే భగవంతుడు. 9యే జీవుడు గావున జీవుడు అతి సమీపముగా నున్న పూర్ణమనే పరమేశ్వరునిలో లీనమైపోవుటకు 9 అనే జీవుడు తాపత్రయపడుచు భగవంతునిలో సులభముగా లీనమైపోవుచున్నాడు. ఇది నిరూపించుటకే ఈ గ్రంథము యొక్క పరమావధి. నేను నా పరిజ్ఞానము సహకరించినంతవరకు భారతీయ వాఙ్మయములో ఎక్కడెక్కడ 9 అంకెతో ఏమేమి కూడుకొని ఉన్నవో వాటినన్నింటిని ఏరి సమకూర్చినాను. చదువరులు తప్పులున్న క్షమించగలరని ప్రార్థించుచున్నాను. గ్రంథము చాలారోజులు శ్రమించిన గాని బయటకు రాకున్నది. మొత్తము 702 ఉద్ధారముల (ఐటమ్స్) వరకు వ్రాసి యుంటిని, ఈ గ్రంథము 2001 నుంచి డి.టి.పి. చేయుటకు ముందు రాజమండ్రిలో ఇచ్చి ఉంటిని. వారు రెండుసార్లు డి.టి.పి. చేసినారు. కాని దానిని శుద్ధప్రతిగా రూపుదాల్చుటకు విపరీతమైన తప్పులు కొట్టుటవలన సాధ్యముగాలేదు. అనేకసార్లు టైపువాండ్ల దగ్గరకు మరల తిరిగి నా దగ్గరకు వచ్చునప్పుడు కొన్ని ఉద్గారాలు (ఐటెమ్స్) అదృశ్యమైనవి. ఇప్పుడు ఉన్నంతవరకు పుస్తకము అచ్చువేయుచున్నాను. ముఖ్యముగా ఈ నవీనకాలములో మన పిల్లలందరు పాశ్చాత్య నాగరిక పోకడలు అలవాటు చేసుకొనుచు భారతీయతను మరచి పోవుచున్నారు. ఇప్పుడు మరల ఇటువంటి అనేక గ్రంథములను మన సంతతివారికి అందించి అసలు భారతీయత మరుగునపడిపోవుచున్న తరుణంలో కొంతవరకైనా పిన్నలు పెద్దలు చదివి ఆకళింపు చేసుకుంటారని ఆశిస్తున్నాను. చాలా సుదీర్ఘమైన పరిశోధనా గ్రంథము గావున అందరూ చదవవలసిన గ్రంథముగా నేను భావించుచున్నాను. ఆనాటి భారతదేశ ఆచార వ్యవహారములు,