
BHARATPAI CHAINA DANDAYATRA
₹20
In stock · 22 available
PublisherVETERAN JOURNALISTS ASSOCIATION
LanguageTelugu
తొలిపలుకు అవి "హిందీ చీనీ భాయి భాయి" అనే నినాదం మారుమ్రోగుతున్న రోజులు. భారత ప్రధాని నెహ్రూ, చైనా పీపుల్స్ రిపబ్లిక్ ప్రధాని చౌ ఎన్ లై చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. టిబెట్ పై చైనా కన్ను పడింది. 1954లో వాణిజ్య అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకుంది. దానిలో తొలిసారి పంచశీల ప్రస్తావన తెచ్చింది. నెహ్రూకు నచ్చింది. 1955లో ఢిల్లీలో ఉభయ ప్రధానులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పంచశీలను పేర్కొన్నారు. కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాలు అలీనంగా ఉండాలన్నదే నెహ్రూ అభిమతం. 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్లో జరిగిన 29వ ఆసియా ఆఫ్రికా దేశాల సభ దీనిని ధ్రువీకరించింది. ఆనాటి నుండి నెహ్రూ, నాసర్, సుకర్నో, టిటో అలీన సిద్ధాంత వ్యవహర్తలుగా పేరుగాంచారు. పంచశీల సిద్ధాంతం నాలుగోవంతు ప్రపంచం ఆమోదం పొందింది. ఇంతకీ ఈ పంచశీల ఏమిటి? ఐదు శాంతియుత సహజీవన సూత్రాల సమాహారం. 1) ఒకరి భూభాగాన్ని, సార్వభౌమాధికారాన్నీ మరొకరు గౌరవించడం. 2) ఒకరిపై మరొకరు దురాక్రమణకు పాల్పడకపోవడం. 3) ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకపోవడం. 4) సమానత్వం ప్రాతిపదికపై పరస్పర లాభం కోసం ప్రయత్నించడం. 5) శాంతియుత సహజీవనం సాగించడం. ఆఖరుది అత్యంత మహత్వపూర్ణమైనది. మొదటి నాలుగూ దీనికి తోడ్పడేవే. ఇరు దేశాల మధ్య ఏవైనా వివాదాలు తలెత్తితే సమానత్వ ప్రాతిపదికపై ఉభయతారకంగా వాటిని పరిష్కరించుకుంటే శాంతియుత సహజీవనానికి డోకా ఉండదు. శాంతియుతంగా ఎవరి అభివృద్ధికి వారు తంటాలు పడవచ్చు. ఇలాటి స్థితిలో మన ఉత్తర సరిహద్దులో మొదట అతిక్రమణ, తర్వాత దురాక్రమణ, ఆ పైన దండయాత్ర జరిగాయి. భాయి భాయి నినాదం ఎగతాళి పాలయింది. పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు, ఆ ప్రాంతం మంచు కురిసే ప్రాంతం గనుక, గడ్డిపరక కూడ మొలవదని నెహ్రూ చెప్పారు. అలాటి చోట ఎక్కడి దాకా ఎవరి ప్రాంతమో గుర్తించడము కష్టమే. పంచశీలే దానికి పరిష్కారం చూపుతోంది.