BHAVA CHITRALU-150 by J.BAPUREDDY Telugu book cover

BHAVA CHITRALU-150

by J.BAPUREDDY

₹150
In stock · 9 available
PublisherJUBILEE PUBLICATIONS
LanguageTelugu
అందరికీ నా వందనాలు ఈ "భావ చిత్రాలు” నా కవితాయాత్రలో అప్పుడప్పుడు, అక్కడక్కడ మనసులో మెరిసిన స్పందనలకు అక్షరరూపం. "వాక్యం రసాత్మకం కావ్యం" అనే నానుడి, కవితా తత్వం గురించి ఎన్నెన్ని సిద్ధాంతరాద్ధాంతాలు వెలువడినా, చెక్కుచెదరని సత్యం. అయితే 'రసాత్మకత' కావ్యసృష్టిలో అనేక రూపాల్లో, ప్రక్రియల్లో, పరిమాణాల్లో ఆవిష్కృతమౌతుంది. అయినా, 'మినీకవిత'గా వ్యవహరింపబడుతున్న అనేక చిరు కవితలు నేడు విజ్ఞుల, రసజ్ఞుల ఆదరాభిమానాలు పొందుతున్న అనేక రూపాల్లో, నామకరణాలతో వెలువడుతున్నవి. వేమన ఆటవెలదుల వలె, మినీ కవిత సభ్యస్ఫూర్తి కలిగిస్తాయి. తీరికలేని వాళ్లకైనా కవితా స్వాదన చేయడానికి, రసాత్మకంగా లోకానుభవాలను దర్శించడానికి తోడ్పడుతాయి. ఏరంగంలోనైనా "ఎందరో మహానుభావులు” ఉన్నా “కొందరికే వందనాలు" అనడానికి ఆస్కారం ఉంటుంది. నేను చేసిన ఈ చిరు ప్రయత్నం యొక్క అక్షరరూపమే ఈ “భావచిత్రాలు”. ఇవి నాకు 'వందనాలు' తెచ్చిపెట్టకపోయినా వీటిని సానుభూతితో రసజ్ఞులు స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ 'భావచిత్రాల'ను 'బాపురే! ఇవి స్వభావచిత్రాల'ంటూ ఎంతో వివేచనాత్మకమైన పీఠిక అందించిన డా|| వోలేటి పార్వతీశం గారికి కృతజ్ఞుణ్ణి. పీఠిక చదివి వారినీ, నన్నూ పాఠకులు అభినందిస్తారని నా సంపూర్ణవిశ్వాసం. ఇంతకంటే నేను ఈ గ్రంథం యొక్క విశిష్టత గురించి ఏకరువు పెట్టనక్కరలేదు. నేను నా రచనలను నాటి 'భారతరత్న' ఇందిరాగాంధి నుంచి నేటి 'బాలికారత్నం' పూజాజ్యోతి వరకు అన్ని రంగాలకు, అన్ని స్థాయిల్లో ఉన్న వారికి అంకితం చేసే అదృష్టం కలిగినందుకు ఆనందంగా ఉంది. ఈ కృతిని అభినందన పూర్వకంగా తన 'కుటుంబం'తో కలిసి 'అంకితం' తీసుకుంటున్న చిరంజీవి పూజాజ్యోతిని చూసి నేను గర్వపడుతున్నాను.