
BHAVA THARANGALU - 50
₹50
In stock · 27 available
PublisherJONNAWADA RAGHAVAMMA
LanguageTelugu
భావ తరంగిణి పాలమూరు జిల్లా గర్వించదగ్గ రచయిత్రి, 'రాధికా గీతాల' సృష్టికర్త అయిన జొన్నవాడ రాఘవమ్మ ఎనిమిది పదులు దాటినా నవనవోన్మేషంగా దేశభక్తి గీతాలు రాయడం, వాటిని పదిమందికి వినిపించడం వాటిపట్ల ఆమెకున్న సాహిత్యాభిలాషను తెలియజేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా పైగా సాహితీ సృజన చేస్తున్న రాఘవమ్మ గీతాలు ఆకాశవాణిలో అప్పట్లో వరుసగా ప్రసారమై ఆబాల గోపాలాన్ని అలరించాయి. వాటిలోని గేయాలను 'రాధికా గీతాలు'గా వెలువరించింది. ఇప్పుడు 'బావనా తరంగాలు' పేరుతో శతాధిక గేయాల సంపుటిని వెలువరించింది. ఈ గేయ సంపుటిలో మొత్తం నూటపదిహేను గేయాలున్నాయి. నాలుగు రూపకాలున్నాయి. రాఘవమ్మకు దేశభక్తి, మాతృభక్తి మెండు. ఏ కావ్యకర్తకైనా ఇవి సహజలక్షణాలు. రాఘవమ్మ రాసిన గేయాల్లో దేశభక్తి, మాతృభక్తి, మాతృభాష, పండుగలు, పల్లె, రైతులు, భక్తి, దేవతలు మొదలైనవి ప్రసిద్ధమైనవి. సరళమైన భాషలో, అలతి అలతి పదాలతో రాసిన గేయాలు అందరిని అలవోకగా చదివిస్తాయి. హాయిగా పాడిస్తాయి. మనసును పులకింపజేస్తాయి. పాదాలు పరవశింపజేస్తాయి. గేయం గానాత్మకమైనది. లయాత్మకమైనది. అందరినీ మెప్పించేది. మనం ఏ పని చేసినా ముందుగా గణపతిని పూజించి ప్రార్థిస్తాం. ఇందులో కూడా రాఘవమ్మ 'జైగణేశ' అంటూ స్తుతి గేయంతో ప్రార్థించి గేయ సంపుటిని ప్రారంభించింది.