BHAVABDHIPOTAM by M.K.PRABHAVATHI Telugu book cover

BHAVABDHIPOTAM

by M.K.PRABHAVATHI

₹100
In stock · 35 available
PublisherM.K.PRABHAVATHI
LanguageTelugu
నాందీ పద్యం "నందయతీతి నాంది:" ఆనందాన్ని పొందించేది నాంది. ప్రాచీన కావ్యాలు, నాటకాలు మొదలగునవి అన్నీ నాందితోనే ప్రారంభమయ్యేవి. నాందికి ఉండాల్సిన ప్రధాన లక్షణాల రెండు. 1. ఇది నమస్కారమో, ఆశీర్వచనమో, మంగళాశాసనం వంటిదో అయి వుండాలి. 2 కావ్యార్థ సూచన ఉండాలి. ఇప్పుడు పోతన్నగారు నాందీ పద్యాన్ని ఎంత గొప్పగా సృజించారన్నది చూద్దాము. 5. శ్రీ కైవల్య పదంబుఁజేరుటకునై / చింతించెదన్ లోక ర క్షైకారంభకు, భక్తపాలన కళా / సంరంభకున్ దానవో ద్రేక స్తంభకుఁ, గేళిలోల విలస / దృగ్జాల సంభూతనా నాకంజాత భవాండ కుంభకు మహా / నందాంగనాడింభకుF. వ్యాఖ్య : ఈ కావ్యము యొక్క తొలి ప్రయోజనము కైవల్యాన్ని ప్రాపింప జేయగలగడం. ఈ భాగవత కథ వివరించబడినది మహారాజు పరీక్షిత్తుకు. వారం రోజుల లోపల తక్షక విషగ్రస్తుడై అతడు చనిపోవాలని శృంగి అనే ముని కుమారుడిడిన శాపాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడానికి పరీక్షిత్తు చేసిన ప్రయత్నమే భాగవత కథా శ్రవణానికి కారకమైనది. చావు తప్పించుకోలేనప్పుడు, అంతకంటే అధికమైన ఫలితం ఏముంటుంది? కైవల్యాన్ని అందుకోవడం కాక. రెండవ వ్యక్తి కథకుడు పోతన. ఈయనకు మొదటి నుండి ఐహిక భోగములపై ఆసక్తి లేదు. పారమార్థిక దృష్టి ఉండేవారు కోరుకొనేది కైవల్యమే కదా! ఇది ఉత్తమ పురుషంలో చెప్పబడింది. కాబట్టి ఎవరు దీన్ని చదువుతారో వారికి కూడా కైవల్యం చేరుకొనే ప్రయోజనం సిద్ధిస్తుంది. శ్రీ అనే అక్షరాన్ని కైవల్యానికి చేర్చడమెందుకు? 'శ్రీ' అనే అక్షరానికి ఎన్ని అర్థాలున్నవో ఏకాక్షర నిఘంటువు చెబుతుంది. వీటిలో అన్వయించుకోదగినవేవి అనేది మీరే తెలుసుకోండి. ఎమ్.కె. ప్రభావతి