
BHAVAGEETHALU DEVULAPALLI KRISHNASASTRY KRUTULU
by DR.AVASARALA VINJAMURIANASUYA DEVI
₹200
In stock · 71 available
PublisherDR.AVASARALA VINJAMURIANASUYA DEVI
LanguageTelugu
మునిపలుకు అసలు - చందమామకీ, వేగుచుక్కకీ కాగడా పట్టడమేమిటనే ఆలోచనలోకి నన్ను నెట్టినది చి||సౌ|| అనసూయ మామయ్య పాటకు తాను పెట్టిన సంగీతాన్ని స్వరలిపిగా కూర్చిన పుస్తకానికి 'మునిపలుకులు' వ్రాయమని కోరడమే. బాలికా గాయనిగా, గ్రామఫోను ద్వారా ఆంధ్రుల ఆధునిక సంగీత చరిత్రకు తొలి పుటలు దిద్దింది సుమారు అర్థ శతాబ్దికి ముందే ఈ అనసూయ పాడిన (వల్లూరి జగన్నాథరావుగారి) 'కొయ్యోడి పదం' అని, నా తరానికి చెందిన సంగీత ప్రియులకి జ్ఞాపకం చెయ్యనవసరం ఉండదనుకుంటాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 'కళాప్రపూర్ణ' గౌరవ పట్టాన్ని చి॥సౌ॥ అనసూయకు ఇచ్చినా, ఆ మాత్రం కూడా చాలా ఆలస్యంగా జరిగిన మంచి పని! ఒకే కాన్పులో పుట్టిన కవలపిల్లలు కారుగాని, విద్వత్కవి కుటుంబానికి చెందిన తలిదండ్రులకు పుట్టిన అల్లారుముద్దు అప్పచెల్లెళ్ళు కనుకనూ, దేశం పొడుగునా ఆంధ్రమహాజనులను సభలలోను, రేడియో ద్వారాను ఉర్రూత లూగించి, ఆనంద సముద్రంలో ఇంకా ఓలలాడిస్తున్న గాయనీ ద్వయం కనుకనూ, అనసూయాదేవీ, సీతాదేవీ - కలిసే - మనస్సు ముందు కనబడతారు బోటి చాదస్తులైన నేస్తాలకు - సంవాదిత్వ సామరస్యంతో - షడ్జ పంచమాలు కలిసి పలికే హార్మోనిక్ కార్డ్ మాదిరి. నా అప్పట్లో, అంటే అర్థ శతాబ్ది ముందు, రెండు మూడు దశాబ్దాలపాటు సాహిత్య సభలూ, మహిళా సమావేశాలూ, రాజకీయ సమారంభాలూ వింజమూరి సోదరీమణుల పాటలతోనే రాణించేవి. కాకినాడలో - 'బదరిక’ నలభై ఏళ్ళక్రితం మామయ్య - అంటే మధురగేయ మహితశిల్పి, మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కేంద్రంగా - సాహిత్య సంగీత చిత్రలేఖనాది లలిత కళా ప్రియం భావుకులెందరో సమకూడుతూ ఉండే సారస్వత తపోవాటిక - బదరిక.