
BHAVANI GEETHALU
₹150
In stock · 12 available
PublisherHIMABINDU PUBLICATIONS
LanguageTelugu
పాటతో నా ప్రయాణం శిశువులు, పశువులు, చెట్లు, చేమలు పాట వింటే పరవశించిపోతాయి... మరి మానవమాత్రులం మనమెంత! చిన్నప్పుడు మాగ్రామం ములుకుదురులొ కార్తీకమాసంలో తెలతెలవారుతున్నవేళ మా బామ్మ లాంతరు వెలుగులో కూర్చుని పాడే మేలుకొలుపు పాటల్లో అమ్మా సీతమ్మా, మాయమ్మ బంగరు బొమ్మా... లెమ్మా" అనే పాట తర్వాతి కాలంలో మా అమ్మ కూడా పాడేది. మా చేలో నాట్లు వేసే ఆడకూలీలు పాడే పాటల్ని గట్టుమీద నాన్న పక్కన కూర్చుని విని ఆనందించటం ఓ తీపి జ్ఞాపకం. సంక్రాంతి పొద్దుల్లో సాతాని జియ్యరు హరిగానం, జంగం దేవరల పాటలు, సంచార జాతులుగా గ్రామంలో విడిదిచేసే లంబాడీల పాటలు, మేము చిన్నతనంలో పాడిన గొబ్బిళ్ళ పాటలు, మా ప్రభత్తయ్య వయొలిన్ కమాను మీద పలికించిన సంప్రదాయ కృతులు... ఎన్నెన్ని పాటలు వింటూ పెరిగాను! ఇప్పుడంటే టీవీలో, రేడియో, వేదికల మీద ఆఖరికి బిచ్చగాళ్ళు పాడేవి కూడా సినిమా పాటలేగానీ ఆ కాలంలో ఎన్ని వైవిధ్యభరితమైన పాటలుండేవి. కొన్ని కొంచెం కొచెం గుర్తున్నాయి. “గుమ్మడేడే గోపిదేవి, గుమ్మడేడే కన్నతల్లీ" అంటూ మా పెంకుటింటి పైకప్పుకున్న అద్దంలోంచి తెలతెలవారే వెలుగులో బామ్మ పాడుతుంటే ఆ గొంతులోని నిద్రజీర దుప్పటి ముసుగులోంచి నన్ను చుట్టేసి లాలించేది. అంతదాకా ఎందుకు... మా యింట్లో సంక్రాంతికి మేము పెట్టిన బొమ్మల కొలువుల పేరంటాలకి వచ్చిన ముత్తైదువలు ఎన్ని పాటలు, మంగళ హారతులు పాడేవాళ్ళని! వాళ్ళలో ఒకావిడ మా ఆంజనేయుని గుడి పూజారి కోడలు... ఆవిడెప్పుడూ సినిమా ట్యూన్స్లో మంగళ హారతులు పాడుతుంటే చిత్రమైన ఆసక్తిగా ఉండేది. కానీ ఆ పాట వింటున్నంత సేపు ఆ సినిమాపాట గుర్తొచ్చి అవే దృశ్యాలు కళ్ళముందు కన్పించేవి. మా అమ్మ దగ్గర ఒక బైండు చేసిన పాటల పుస్తకముండేది.