BHAYAM KATHA SANKALANAM by DR.K.M.BHAVANI Telugu book cover

BHAYAM KATHA SANKALANAM

by DR.K.M.BHAVANI

₹100
In stock · 94 available
PublisherDR.K.M.BHAVANI
LanguageTelugu
రెండు మాటలు ఎదుగుదల తరువాత పతనం ఎలాగైతే అనివార్యనియమమో, అలాగే 21వ శతాబ్ది రెండవ సగంలో దురాచారాల పెరుగుదలలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. మర్యాదలకు మరియు నైతికతకు విలువనిచ్చే దేశంలో అన్నిటికంటే ఎక్కువ అపరాధాల క్రూర దృశ్యాల సమగ్ర దృశ్యం కనిపిస్తోంది. ప్రతిరోజూ వార్తలలో 5-6 అపహరణలు, అత్యాచారాలు, ఎన్కౌంటర్లు, కాల్పులు మరియు మర్డరు కేసులు చెప్పబడతాయి. అటువంటప్పుడు ఎవరెవరికి శిక్ష విధించాలి? రక్షించమని ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరిని ఎంత వరకు నమ్మాలి? ఎవరు రక్షకులు, ఎవరు భక్షకులు? నాలుగు వైపుల వ్యాపించిన విషపూరిత వాతావరణంలో ఈ మాట సరిగ్గా సరిపోతుంది నేటి యాత్రలో ప్రతిమనిషి నేరస్థుడే స్నేహితులారా. అటువంటి స్థితిలో ఎవరు ఎవరికి విధించాలి శిక్ష........ ఇంటర్నెట్ మరియు ఫేసు బుక్ ల వంటి జనసంచార సాధనాల కారణంగా యువత దారి తప్పింది. బుద్ధిజీవుల ఆలోచన దృష్టి సుఖభోగాలను అనుభవించే దిశగా వెళ్ళ సాగింది. ఈ లోతైన చీకటిగుంటలో పడిపోవటం తప్ప వేరే మార్గమేదీ లేనంతగా మార్పు వచ్చింది. రోజు-రోజుకూ దినచర్యలో అల్పత్వము రాసాగింది. ప్రజలు పట్టపగలు బహిరంగంగా జబర్దస్తీలకు దిగుతున్నారు. సిగ్గు లజ్జ మానవత్వం కళంకాలుగా మారిపోయాయి.