
BHOOMI PATANAM
₹200
In stock · 76 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
ఆయన రాసిన ఈ 'భూమి పతనం' నవల అత్యంత వాస్తవికంగా రూపొందింది. ఇది ఆయన ఆనుభవంలోంచే రచించబడిన నవలలా తోచింది. ఒక పేద సన్నకారు రైతును ప్రధాన పాత్రగా తీసుకొని అతడు అనుభవించిన కష్టనష్టాలను చిత్రిస్తూ నారాయణ ఈ నవల రచించాడు. పేద రైతులకోసం ఇది చేశాం. అది చేశాం అని ప్రభుత్వం వారు ఎన్నో గొప్పలు చెప్పుకుంటుంటారు. కానీ ఈ నవలలోని చంద్రకొండలు అనే రైతు కన్నీళ్ళను మాత్రం ఏ ప్రభుత్వ పథకాలు కూడా తీర్చకపోవడం ఈ నవలలో మనం చూస్తాం. ఇలా ఈ నవలంతా చంద్రకొండలులాంటి సన్నకారురైతు అనుభవించే వేదనను చిత్రిస్తుంది. మత మార్పిడులు ఎందుకు జరుగుతాయో కూడా ఈ రచయిత స్పష్టంగా చెప్పాడు. 'అంపశయ్య' నవీన్ నా ఇరవై ఏళ్ళ జీవితంలో మా వూరు నాకు మొదటిపదేళ్ళలో పాతకాలానికీ, తర్వాత పదేళ్ళలో మారుతున్న కాలానికి గుర్తుగా నిలిచింది. నాలో నేటికాలం కన్నా ఆ పదేళ్ళ పాతకాలపు గుర్తులే నాపై ఎక్కువ ప్రభావాన్ని చూపాయి. ఇందులో వ్యవసాయాన్ని నేపధ్యంగా తీసుకున్నా క్రైస్తవాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించాను. అలాగని ఆమతాన్ని నేను దూషించదలచలేదు. దానిపై ఎలాంటి ద్వేషమూ నాకులేదు. నాకున్న బాధల్లా ఒక్కటే. మారిపోతున్న గ్రామీణజీవనం, భారతీయత. భారతీయత అంటే కులాలుగా, మతాలుగా, వర్ణాలుగా నేను భావించలేదు. వ్యవసాయాన్ని మాత్రమే భారతీయతగా భావించాను. వ్యవసాయం అంటే కేవలం పంట పండించడమేకాదు. దాని చుట్టూ ఎంతో వైవిధ్యభరితమైన జీవన సంస్కృతి ఉంది. భారతదేశం మట్టి లోతుల్లోకి చూసినప్పుడు ఇక్కడి చెట్లతో పాటు మనిషి కూడా అక్కడి నుంచే పుట్టుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. దానికి ఆధారంగానే ఇక్కడి మనిషి వ్యవసాయానికి దాసుడు. అందులోంచే అనేక వైరుధ్యాలు. గూండ్ల వెంకటనారాయణ