
BHOOT BANGALAA
₹50
In stock · 41 available
PublisherVASA PRACHURANALU
LanguageTelugu
భూత్బాంగళా (నవల) రాత్రి 12 గంటలయింది. బేగంపేటలోని మందాకిని అపార్ట్మెంట్ ముందు కాపలామనిషి బీడీ కాలుస్తూ నిలబడ్డాడు. దూరంగా ఉన్న ఓ మేడ వైపు నుంచి అరుపులు వినబడ్డాయి. మున్నెన్నడూ వినబడని అరుపులవి. ఆశ్చర్యంగా తలెత్తి అటువైపు చూశాడు. ఎదురుగా ఉన్న ఓ మేడ బాల్కనిలో రెండు నల్లని ఆకారాలు అటు ఇటు తిరుగుతూ కనపడ్డాయి. అటువైపు నుంచే అరుపులు వస్తున్నాయి. మరింత పరిశీలనగా చూశాడు. ఆ చుట్టుపక్కలంతా చీకటి. అతను చాలా కాలంగా మందాకినీ అపార్ట్మెంట్కు కాపలాగా ఉంటున్నాడు. ఆ మేడను పగలు చూస్తూనే ఉంటాడు. రాత్రి ఎప్పుడూ ఆ మేడ మీద లైట్లు వెలగలేదు. ఆ మేడ మీద కానీ, దగ్గరలో కానీ జనం తిరగడం కనబడలేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంటే అతను ముందుకు అడుగులేశాడు. మరింత పరిశీలనగా చూశాడు. ఆ రెండు ఆకారాలు మరింత స్పష్టంగా కనపడ్డాయి. నల్ల చీరలు కట్టుకుని, జుట్టు విరబోసుకుని అరుస్తూ అటు ఇటు పరుగులు పెడుతున్నాయి. "అమ్మో! అవి దెయ్యాలే తప్పకుండా దెయ్యాలే!" భయంతో అతని గుండె మరింత వేగంగా కొట్టుకుంది. "బాబోయ్ దెయ్యాలు! బాబోయ్ దెయ్యాలు" అరుస్తూ అతను వెనక్కి పరుగుతీశాడు. దెయ్యాలు వెంట పరుగెత్తుకు వస్తాయనే భయంతో వెనక్కి పరుగెత్తుకు వచ్చాడు. మందాకినీ ఫ్లాట్స్ ముందుకు రాగానే గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు. ఎదురుగా ఉన్న తన స్టూలు మీద చతికిలపడ్డాడు.