BHUMADU by PEDDINTI ASHOK KUMAR Telugu book cover

BHUMADU

by PEDDINTI ASHOK KUMAR

₹45
In stock · 4 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సంకల్పం అర్ధరాత్రి పూట. కటకటకటమని చెరుకు గిరుక చప్పుడు. అది యమలోకపు గంటల చప్పుడు లాగా వినిపించింది. కలువరిస్తూ నిద్రలేచింది వసంత. మొద్దు నిద్ర. భూమి మురుక చూసిందంటే గుర్రుకొట్టుడే! పైగా పొద్దంతపని. ఎప్పుడుపోయి మంచంలో వాలుదామా అన్నంత అలసట. అంత అలసటలోనూ నిద్రలేదిప్పుడు. చింపుల బొంత కప్పుకుని బయటకు వచ్చింది వసంత. నిండుగా ఎన్నీల. చెట్ల కైనీడలు గాలికి కదులుతున్నాయి. సూరు కైనీడల కింద బజారు కుక్కలు మలుసుకపన్నయి. గురుజు మీద గుడ్లగూబ గుగ్గూగుప్ మంటుంది. ఇంటి ముందున్న చింతచెట్టు మీద చిమ్మట్లరొద. బొందలగడ్డకు నక్కలు ఊలలు పెడుతున్నయి. కొప్పులగుట్టకు నెమళ్ళు మ్యావ్ మంటున్నయి. ఇన్ని శబ్దాల నడుమ చెరుకు గిరుక చప్పుడు చెవుల ముందే మోగినట్టు కటకటమంటుంది. సూరు కింద అరుగు మీద కూసుంది వసంత. మనసు, ఆలోచన, బాధ, భయం అన్నీ ఆ చప్పుడు చుట్టే తిరుగుతున్నాయి. ఇప్పల్ల రెండెకరాల చెరుకుతోట. ఊరికి రెండుమైళ్ళ దూరం. కట్టెను కొట్టి ఫ్యాక్టరీకి అమ్ముదామని వసంత. కాదు బెల్లం వండుదామని పెద్దులు. ఎవడు పెట్టుకున్న పెంట.