BHUVAN FUN BOOK by DR.BHUVAN Telugu book cover

BHUVAN FUN BOOK

by DR.BHUVAN

₹100
In stock · 67 available
PublisherSAHITHI MITHRA SOURABHALU
LanguageTelugu
భువన్ స్లాష్ స్టార్ (Bhuvan / Star) కార్టూనిస్ట్ భువన్, సంతకం తోనే చెప్పుకున్నారు, తానొక కార్టూన్ నక్షత్ర ప్రచారకుడని. అంటే? ఈ ప్రశ్న నన్ను నేనే వేసుకున్నాను. నేనేంచెయ్యాలి? కార్టూన్ అవగాహన నాలో మెండుగా వుండాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ నేను తినే తిండీ, పీల్చే గాలిలో, నా ఆలోచనల్లో, భాగం కావాలి. నేను గీసే గీతలకి ప్రాణం పోయగలిగే నైపుణ్యం కొంత నేర్చితే చాలు, కార్టూన్ కళలో నిష్ణాతులైన గురువుల కార్టూన్ పుస్తకాలని తిరగేసి, సూక్ష్మాలు గ్రహించి, కార్టూన్లు గీసి పత్రికలకి పంపించి, ఆ స్టేజీ మీద ఉత్తీర్ణుడైతే, జెండా ఎగరవేసినట్లే లెక్క ఆ తర్వాత నేనుగా ఒక పుస్తకం నలుగురు మెచ్చుకునే విధంగా వేసుకోవాలి. కార్టూనిస్ట్ మిత్రులతో తరచూ కార్టూన్ అంశాలని చర్చించుకుంటూ, కార్టూన్ పోటీల్లో, ప్రదర్శనల్లో పాల్గొంటూ, కార్టూన్ సంబంధిత కార్యక్రమాలని నిర్వహిస్తూ, పయనం సాగించాలి. కార్టూన్ కళని ప్రొత్సహించాలి. భువన్ ఇవన్నీ చేశారా అంటే, ఇంతకిమించే చేశారు. చేస్తూ వస్తున్నారు. తమ తండ్రి గారు మళ్ల జగన్నాధం మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉన్నత స్థాయిలో సాహితీ సేవలందిస్తున్నారు. కవులనూ, కథ, నవలా రచయితలనూ, కార్టూనిస్టులను సన్మానిస్తున్నారు. బహుమానాలూ, బిరుదులూ గౌరవ పురస్కారాలూ అందిస్తున్నారు. కళాకారుడుగా, కళాపోషకుడుగా విరాజిల్లుతున్నారు. అందుకే అన్నాను, డా. భువన్, ఒక స్టార్ కాంపెయ్నర్ అని, ఆయన ఒక నిస్స్వార్ధ కార్టూన్ నక్షత్ర ప్రచారకుడు. సందేహమే లేదు. ఇది నేనొక్కడినే చెప్పటం లేదు. భువన్ గారినెరిగిన ప్రతి కవీ, రచయిత, సాహితీ వేత్తా, పత్రికా సంపాదకుడూ, కార్టూనిస్టూ, ముక్త కంఠంతో చెబుతున్నవిషయం. తోడి కార్టూనిస్ట్ మిత్రులందరూ, ఈ సంకలనంలో వారి సందేశాల్లో ఈ మాటే చెప్పి భువన్ ని ప్రశంసించారు. కార్టూనిస్ట్ భువన్ ది ప్రత్యేక శైలి. అన్నీ సన్నటి క్రోక్విల్ గీతల సరదా బొమ్మలే. పెద్ద చదువు, ఉద్యోగం, చిరంజీవుల ప్రత్యేక పెంపకం, సంసారం, సాహితీ సేవ, వీటి మధ్య దొరికిన స్వల్ప విరామాలని తన స్రుజనాశక్తి తో సద్వినియోగం చేసుకుని స్రుష్టించినవీ ఈ నవ్వుల వెన్న ముద్దలు. నేను పదే పదే చెబుతుంటాను. కార్టూన్ కి భావం ప్రధానం. హస్యం, వ్యంగ్యం, పాలూ పంచదార తేట తెలుగు వ్యాఖ్య కలిపితే అది రుచికరమైన పాయసమే. భువన్ ఇంతకు ముందు ఏ కార్టూనిస్టూ తలపెట్టని ప్రయోగం చేశారు. మన చేతికి బరువైన వెండి గ్లాసు నిండా నవ్వుల పాయసం అందించారు. పుస్తకం కవరు నుంచి చివరిదాకా ఫుల్ పేజీ కార్టూన్లు నింపారు. అంతే కాదు. పాయసంలో జీడిపప్పులాగా, ఈ పుస్తకం కలర్ ఫోటోల ఆల్బం కూడా! భువన్ ఫన్ బుక్ ఒక "స్మైలీ సెల్ఫీ" ....!!! ప్రతీ కార్టూనిస్టుకి ఫుల్ పేజీ కార్టూన్లు గీయడం చాలంజింగ్ గానే వుంటుంది. ముందుగా ఒక టాపిక్ నిర్ణయించుకోవాలి. అది,