BIDDALA SIKSHANA - CHALAM SAHITYAM NAVALALU by CHALAM Telugu book cover

BIDDALA SIKSHANA - CHALAM SAHITYAM NAVALALU

by CHALAM

₹160
In stock · 129 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
ISBN9788199677913
“తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలం ది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణానుభూతాంతరాలను రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు విస్తృతంగా చేశారు. ఇంకా వ్యాసాలు, లేఖలు, పీఠికలు, మేలుకొలిపే ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కన్నుమూశారు. ✦ ✦ ✦ “చలంగారు నిజజీవితంలో ప్రధానంగా ప్రేమిక కోసమూ, బిడ్డలకోసం పోరాడారు. కానీ ప్రేమ విషయమే అధికంగా వారి సాహిత్యంలో వస్తుంది. పవిత్రత నుండి తన సంతాన పోషణ, శిక్షణల్లో స్వయంగా శ్రద్ధ వహించి ఆ అనుభవంతోనే ఈ పుస్తకం రాశారు. ‘...బిడ్డని హింస పెట్టకుండా వాళ్ల చేత మీరు హింసపడకుండా ఉండే మార్గాన్ని చూపటానికే ప్రయత్నం...’ అన్నారు. “ఇంతకాలం బిడ్డలు, తల్లిదండ్రులకే త్యాగాలు చేయాలని బోధించారు. ఇది అక్రమమని, పెద్దవారే బిడ్డలకై త్యాగం చేయవలసినది అని నేను ఈనాడు బోధిస్తున్నాను...” అన్నారు. నేడు బిడ్డల మీద శ్రద్ధ – త్యాగం వహించిన మాట నిజమే. కానీ ఈ గ్రంథం త్యాగం పెట్టుబడిలాంటిది. నేటి బిడ్డలకు నేర్పవలసిన పుస్తకమిది. – డా॥ వాడ్రేవు సుబ్బారావు