
BIG THINKING
₹100
In stock · 7 available
PublisherSAI BABA PUBLICATIONS
LanguageTelugu
BIG Thinking ది మ్యాజిక్ పవర్ ఆఫ్ బిగ్ థింకింగ్ సక్సెస్ అంటే ఎన్నో అద్భుతమైన, పాజిటివ్ విషయాలను నిజం చేసే మంత్రదండం. సక్సెస్ అంటే వ్యక్తిగత ఆస్థులు సంపాదించటం, అందమైన ఇల్లు, ఆర్థిక భద్రత, ప్రయాణాలు చేయడం, మీ కుటుంబానికీ, పిల్లలకూ అంతులేని సంపద, ఆనందాన్ని చేకూర్చటం. సక్సెస్ అంటే మీ వ్యాపారం, కెరీర్, సామాజిక జీవితంలో ప్రశంసలు పొందటం, నాయకత్వం వహించే అవకాశం రావటం. సక్సెస్ అంటే స్వేచ్ఛ, బాధలు, భయాలు, నిరాశ నిస్పృహలు, అపజయాలు నుంచి స్వేచ్ఛగా జీవించగలిగే అరుదైన ఛాన్స్ సక్సెస్ అంటే ఆత్మగౌరవం, జీవితం నుంచి వీలయినంత ఎక్కువ ఆనందం. సంతృప్తిని పొందటం. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు వీలయినంత ఎక్కువ చేయగల సామర్థ్యమే సక్సెస్. సక్సెస్ అంటే గెలవటం.. సక్సెస్... గెలవటం అనేదే మనందరి జీవిత ధ్యేయం. ప్రతి మనిషీ గెలవాలనే అనుకుంటాడు. జీవితం నుంచి వీలయినంత ఎక్కువ సాధించాలనుకుంటాడు. ఏ వ్యక్తి కూడా తక్కువ స్థాయిలో దరిద్రంలో బ్రతకాలని కోరుకోడు. జీవితంలో సక్సెస్ ఎలా సాధించాలన్న విషయాన్ని గురించి బైబిల్లో కూడా చెప్పటం జరిగింది. అదేమిటంటే నమ్మకం. "నమ్మకం మహా పర్వతాలను కూడా కదిపేస్తుంది..." అవును నమ్మండి. బలంగా నమ్మండి. మీరు పర్వతాలనే కాదు దేన్నయినా కదపగలరు. ఏదైనా సాధించగలరు. చాలామందికి తాము ఏదైనా సాధించగలమన్న విషయం తెలీదు. అందుకే వాళ్ళు ఏమీ సాధించలేకుండానే వుండిపోతున్నారు. కొంత మంది "నమ్మకంతో పర్వతాలను కదపటం ఏమిటి?" అంటూ ఎద్దేవా చేస్తూ వుంటారు. పేళ్ళు దేన్నీ నమ్మరు. తమను తామే నమ్మరు. ఇటువంటి వాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరు. ఐదు బెడ్రూమ్ ఇళ్లు, డబ్బు, నాయకత్వం సంపద, హోదా, పేరు ప్రతిష్టలు కావాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. అప్పుడే మీకు సర్వస్వం వస్తాయి.