BIGGEST THINKING by ADELLA SIVAKUMAR Telugu book cover

BIGGEST THINKING

by ADELLA SIVAKUMAR

₹60
In stock · 1 available
PublisherOM PUBLICATIONS
LanguageTelugu
జీవితం 2022 కొన్ని లక్షల మంది ప్రేక్షకులు టీవీలో వచ్చే ప్రోగ్రాం ఉత్సుకతతో చూస్తున్నారు..... అందులోనూ అది లైవ్ టెలీకాస్ట్' అంటే ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. క్రికెట్టో, ఫుట్బాల్ మ్యాచ్ కాదు... పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం కూడా కాదు... శోభనం.... భార్యాభర్తల తాలూకు మొదటి రాత్రి లైవ్ టెలీకాస్ట్ జరుగుతుంది... ఏంటీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు? మరో ఇరవై సంవత్సరాల్లో ఇదంతా జరగబోతుందా? ఎప్పటికీ జరగకూడదని ప్రార్ధిద్దాం... కానీ ఎవరు ఆపగలరు? మున్ముందు ఇంతటి దారుణమైన రోజులు రాబోతున్నాయా? చెప్పలేం... రావచ్చు... రాకపోవచ్చు. ఇరవై ఏళ్ల క్రితం మనం ఊహించామా? లోపల అండర్వేర్ కనబడేలా హీరోయిన్ డాన్స్ చేస్తుంటే ఇంటిల్లపాదీ చూస్తామని....... డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ఛానెల్లో ఇద్దరు మనుష్యులు పాశవికంగా కొట్టుకుంటుంటే చూస్తూ అమ్మాయిలు సెమీ న్యూడ్గా క్యాట్వాక్ చేస్తుంటే అదే ఫ్యాషన్గా మారిపోతుందనీ.... ఇంటర్నెట్లోకి వెళితే ఇంకా చాలా చాలా..... ఇదంతా ఇరవై ఏళ్ల క్రితం మనం కలలో కూడా ఊహించలేదు. కానీ ప్రస్తుతం జరగటం లేదా ? అదే విధంగా పై సంఘటన కూడా ఇరవై ఏళ్ల తర్వాత జరుగుతుందేమోనన్న సందేహం ఓ ఫిక్షన్ రచయితగా నాకుంది. చాలా విషాదకరమైన పరిణామం.