
BILL GATES,AJIM,PREMJI,NARAYANAMURTHY
₹40
In stock · 2 available
PublisherADELLA SIVAKUMAR
LanguageEnglish
బిల్ గేట్స్... మనం బ్రతుకుతున్న ఈ భూమ్మీద కోట్లాదిమంది వ్యక్తులు పుడుతూ, మరణిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎవ్వరూ పట్టించుకోరు. ఈ ప్రపంచం, ప్రజలు ముందుకు సాగిపోతూనే ఉంటారు. కానీ ఈ ప్రపంచ చరిత్రగతిని మార్చేసిన వ్యక్తులు కొందరు ఉంటారు. వాళ్లు సాధారణంగా మనందరిలానే జన్మించినా కూడా అసాధారణమైన వ్యక్తిత్వంతో అజేయమైన విజయాలను సాధిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తారు. “వీళ్లు ఇంత గొప్ప స్థాయికి ఏవిధంగా చేరుకున్నారా?" అని అందరూ ఆశ్చర్యపోతూ చర్చించుకుంటారు. " వీళ్ల విజయ రహస్యం ఏమిటి?" అని ఇతరులు తలలు బ్రద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తమ తమ రంగాల్లో వాళ్లు సాధించిన, సాధిస్తున్న విజయాలు ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అటువంటి వ్యక్తిత్వ సంపన్నులను గురించి తెలుసుకోవడం ద్వారా మనలో కూడా " ఏదైనా సాధించాలి " " సాధించి తీరాలి" అనే ధృడమైన సంకల్పం ఏర్పడుతుంది. మనం భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు ఆ సంకల్పమే పునాది.