
BOLLIMUNTHA PILLALA KATHALU
by BOLLIMUNTHA SIVARAMAKRISHNA
₹50
In stock · 1 available
PublisherBOLLIMUNTHA SIVARAMAKRISHNA FOUNDATION
LanguageTelugu
అనంతమైన జనజీవన రాగాలను మీటిన బొల్లిముంత శివరాం కవి, రచయిత, పండితుడు మాత్రమే కాదు.. సామ్యవాది, విప్లవ కమ్యూనిస్టు యోధుడు. పెన్ను గన్నుతో ఎర్రపాళీని ఎక్కుపెట్టి అక్షరాలను ఆయుధాలుగా మార్చి తెలుగు సినీ జగత్తులో మాటల తూటాలు పేల్చిన మాంత్రికుడు. కలం బలంతో సాయుధ పోరాటాలకు ఊతమిచ్చిన మేరునగధీరుడు. ★ మౌన మునిలా కనిపించే ఆయన మస్తిష్కంలో భావాల అగ్నిపర్వతాలు లావాలా ఉప్పొంగేవి. నిర్భయంగా నిజాయితీగా వ్యక్తమయ్యే ఆయన ఆలోచనలు తుపాకీ తూటాల్లా దూసుకువస్తాయి. కథలు, అభ్యుదయ సాహిత్యం, నాటకాలు, హరికథలు, బుర్రకథలు, జనకథలతో పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని తపనపడిన ఆయన తెలంగాణ సాయుధ పోరాటాన్ని 'మృత్యుంజయులుగా' తీర్చి తెలుగుజాతి సమైక్యతను చాటారు.