BOMMA VENUKA - MARIKONI KADHALU by AMBALLA JANARDHAN Telugu book cover

BOMMA VENUKA - MARIKONI KADHALU

by AMBALLA JANARDHAN

₹100
In stock · 5 available
PublisherAMBALLA JANARDHAN
LanguageTelugu
నా మాట నమస్కారమండీ ! 2004లో నలభై కథలతో "అంబల్ల జనార్ధన్ కథలు వెలువరించినపుడు మున్ముందు ఇంకో కథల సంపుటి తీసుకొస్తానని ఊహించలేదు. కాని నా కలం ఆగనంది. అడపా, తడపా తన ఉనికిని చాటుకుంది. పర్యావసానమే ఈ కథా సంపుటి. పదిహేనేళ్ళ క్రితం నేను కథా రచనకు పూనుకున్నప్పటి నుండి ఇప్పటి దాకా సాహిత్య రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. రాసేవారి రాశి పెరిగింది. వాసి పెరిగింది. అన్ని తరగతుల వారు, అన్ని రంగాలవారు రచనా రంగంలో అడుగు పెడుతున్నారు. వస్తు వైవిధ్యం కూడా విస్తృతమైంది. రచనలు సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇది మంచి పరిణామం. కాల్పనిక సాహిత్య పఠనం తగ్గినప్పటికీ, ఇంకా కొందరు పాఠకులు కథకులను, నవలా రచయితలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మునుపెన్నడూ లేని కథా సంపుటాలు వెలువడుతున్నాయి. పుస్తకం కొని చదువేవారు కరువని తెలిసిన రచయితలు, పుస్తకాలను ఉచితంగా ఇవ్వడానికి వెనుకాడడంలేదు. ఏదో విధంగా పఠనాసక్తి కొనసాగింప చేయాలనీ, తమ రచనలపై స్పందన చవి చూడాలనీ, ప్రతి రచయిత తహతహలాడుతాడు. కంటి తుడుపులాగా అయినా పాఠకులు రచయితలను సంతృప్తిపరచాలి. వారికి పోస్టుకార్డు ద్వారానైనా తమ స్పందనని తెలుపాలి. ఇదినా ఆశ, ఆకాంక్ష, అది అత్యాశకాదని పాఠకులు గమనించి తమ అభిప్రాయాలని తెలపాలని కోరుతున్నాను.