BOMMALA KOLUVU - BALA GEYALU by RAJA VASIREDDY MALLEESWARI Telugu book cover

BOMMALA KOLUVU - BALA GEYALU

by RAJA VASIREDDY MALLEESWARI

₹50
In stock · 56 available
PublisherRAJA VASIREDDY MALLEESWARI
LanguageTelugu
'బొమ్మల కొలువు' గురించి...... మన భాష అనంతం అందమైన పదాలు దాని సొంతం. మనలో కలిగే అనేకానేక ఆలోచనలను, ఊహలను, భావాలను, బహిర్గతం చేయటానికి భాష చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు. వారి వయసుతోపాటు తగిన పదజాలాల్ని అందించవలసిన బాధ్యత పెద్దది. అంటే అమ్మా నాన్నలది ఉపాధ్యాయులది. అమ్మ నోటి నుండి వెలువడి, వినే మాటలే బిడ్డల భాష గురించిన ప్రథమ పరిచయం. ఆమె మాటలు పాడే పాటలే లయాన్వితము, శ్రావ్యము అయితే బిడ్డకు ఎప్పటికీ స్మృతిలో నిలుస్తాయి. అనాదిగా వస్తున్న బాలగేయాలెన్నున్నా కొత్త కొత్త గేయాలు రావలసిన, కావలసిన అవసరం ఎంతైనా ఉంది నేడు. ఎందుకంటే పిల్లల పరిథిలోని పరిసర జ్ఞానం దానికి తెలియజెప్పే పదజ్ఞానం వారి కవసరం. ఆ పదజ్ఞానం అంత్య ప్రాసతో అలతి అలతి పదాలతో చిన్న చిన్న గేయాలతో పిల్లలకందిస్తే భాష, భావం, వ్యక్తీకరణ, పదజ్ఞానం, పలు అంశాల జ్ఞానం అన్నీ పిల్లలకందుబాటులోకి వస్తాయి. నేను చిన్న పిల్లగా ఉన్నపుడు మా గురువుగారు ఒక ఎక్కాన్నో, పద్యాన్నో చెప్తే వాటిని బడి నుండి ఇంటికి వస్తూ, ఇంటి నుండి బడికి వెళ్తూ, ఆడుకునే సమయాన పదే పదే మననం చేసుకునేదాన్ని, అందువలన అవి ఈనాటికి గుర్తున్నాయి. అలాగే మా అమ్మ రాట్నం వడుకుతూ పిల్లలైన మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, అన్నం తినేటపుడు వేమన, సుమతీ శతక పద్యాల్ని నేర్పేది. దాని వలనే భాషపట్ల మక్కువ పెరిగి నేను కవయిత్రిని, రచయిత్రిని కాగలిగాను. తెలుగును ఎక్కువగా వినటం వలన తెలుగు భాషా పదసంపద నాకు దొరికింది. ఆ సంపదను నేటి పిల్లలు కూడా అలాగే అందుకోవాలని నా ఉద్దేశం. మూడు దశాబ్దాల పైగా తెలుగు భాషా ఉపాధ్యాయినిగా పని చేసినందున విద్యార్థులకు చేరవలసిన పదజాలం చేరటం లేదని అర్థమైంది. ఆ పదజ్ఞానాన్ని అందించటానికి ప్రయత్నాలు చేశాను. చిన్న పదాల పేరుతో రెండు పంక్తులు, నాలుగు పంక్తుల బాలగేయాల్ని వార్తలో వ్రాశాను. 'పదంలో పదం' అనే శీర్షికన విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో నిర్వహించాను.