
BORUBAVULAKU RE CHARGE
₹45
In stock · 515 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
బోరుబావులకు రీచార్జ్ - పరిచయం జాతీయ నాయకులు గౌరవనీయులైన నిజలింగప్పగారి (అఖిలభారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు) ఊరైన చిత్రదుర్గ తాలూకాకు చెందిన దొడ్డ సిద్ధవ్వనహళ్లిలో రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచి పొలాలలో, వరి మడులలో నీటి వాడకాన్ని చూసినవాడిని. ఏ ఏటికాయేడు మా బావిలో నీటి ప్రమాణం తగ్గుముఖం పట్టటం గమనించిన వాడిని. కరువు శాపాన్ని అనుభవించినవాడిని. కర్నాటక రాష్ట్రంలోనే అత్యంత కరువు జిల్లాగా గుర్తించబడ్డ 'చిత్రదుర్గ,’ నా జన్మ భూమి. 1976లో మాకు కరువు శాపం తీవ్రంగా తాకింది. ఉన్న మూడెకరాల్లో వేసిన తమలపాకులు, పోకలు, కొబ్బరి కొన్ని రోజుల్లోనే ఎండిపోయాయి. నేను 1987లో పట్టభద్రుణ్ణయ్యాను. మైసూరు విశ్వ విద్యాలయంలో, భూగర్భశాస్త్రంలో ఆరవ ర్యాంక్ సంపాదించి భూగర్భ జల పరిశోధకుడిగా ఉద్యోగంలో ప్రవేశించాను. భూగర్భ జల పరిశోధకుడిగా 1987వ సంవత్సరంలో నేను ఉద్యోగంలో చేరే సమయానికి అక్కడ అత్యంత అధిక అనుభవాన్ని కలిగివున్న సీనియర్ భూగర్భ విజ్ఞానులున్నారు. వారి అనుభవాలు నాకు ప్రోత్సాహక అంశాలయ్యాయి. నా పనికి ఉత్తేజాన్ని ఇచ్చాయి. ఆ రోజుల్లో కేవలం 80 అడుగుల నుంచి 100 అడుగుల బోర్ బావి తవ్వితే చాలు, కావలసినంత నీళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. క్రమంగా భూగర్భ జలం తగ్గుతూ ఈ మధ్య రోజుల్లో పదిహేను వందల అడుగుల లోతుకు తవ్వినా నీళ్ళు దొరకటం లేదు. భూగర్భ జల విషయంలో మనం అంతిమ ఘట్టానికి చేరాం.