BRAHMADEVUDU MAGADE by DR.DAVULURI SRI KRISHNA MOHANARAO Telugu book cover

BRAHMADEVUDU MAGADE

by DR.DAVULURI SRI KRISHNA MOHANARAO

₹70
In stock · 161 available
PublisherDR.DAVULURI SRI KRISHNA MOHANARAO
LanguageTelugu
డా. దావులూరి శ్రీకృష్ణమోహనరావు 1. బ్రహ్మదేవుడూ మగాడే. ఆరోజు అమలాపురం లయన్సు క్లబ్ హాలులో లయన్సు క్లబ్ వార్షికోత్సవం. సివంగులకు సెపరేట్ క్లబ్బుండటం వలన వాళ్ళ పట్టు చీరల రెపరెపలు వినపడ్డం లేదు. వగల ధగధగలు జిగేల్ మనటం లేదు. సింహాలే తెగ కలదిరుగుతూ హడావుడి సృష్టిస్తున్నారు. ముఖ్య అతిధిగా వచ్చిన ఆర్.డి.వో. సామ్రాజ్యం గారు స్టేజిని దడదడలాడిస్తున్నారు. ఆవిడ చిన్న గుమస్తాగా ఉద్యోగాన్ని ప్రారంభించి గ్రూప్ 2 పాసై ఆర్.డి.వోగా ఎదిగిన అసమాన్యురాలని లయన్సు క్లబ్ ప్రెసిడెంటు గారు ప్రారంభోపన్యాసంలో చెప్పారు. నేనెప్పుడూ స్లీపింగ్ లయన్నే. వరండాలో నిలబడి సాటి డాక్టరు వంకాయల శ్రీనివాస్ ఆఫర్ చేసిన సిగరెట్ తుదముట్టించే పనిలో ఉన్నాను. ట్యూబ్లోటు మాడిపోవటంతో వరండా అంతా మసకమసగా ఉంది. అంతలో ఒక బక్కపాటి శాల్తీ నెమ్మదిగా వచ్చి, చేతిలోని సిగరెట్ నోట్లో పెట్టుకుంటూ 'అగ్గిపెట్టె ప్లీజ్' అన్నాడు. నేను సిగరెట్లెప్పుడూ కొనాబోయినా జేబులో ఒక సిగరెట్ లైటర్ పెట్టుకొంటుంటాను. ఎవరైనా సిగరెట్ ఆఫర్ చేస్తే అగ్గి పెట్టి యివ్వమని వాళ్ళనడవగవలసిన అవసరం లేకుండాను, ఆ వంకన కొందరితో చుట్ట (సిగరెట్)రికం కలుపుకుందామని ఆ ఏర్పాటు చేసికొన్నాను. లైటర్ జేబులోంచి తీసి అతనికిచ్చాను. అది వెలిగించలేక అతనిబ్బంది పడుతుంటే నేనే వెలిగించి ఆ వెలుగులో అతన్ని పరీక్షగా చూసేను. మా బుచ్చిరాజులాగనిపించాడు. "మీరు బుచ్చిరాజుగారు..." అంటూ నసిగాను. "మీరు కృష్ణమోహన్ గారు" అన్నాడతను నన్ను గుచ్చిగుచ్చి చూస్తూ "చూడగానే అనుకున్నాను మీరు బుచ్చిరాజుగారని” "బుచ్చిరాజుగారేంటి? చిన్నప్పట్లా బుచ్చిగా అని పిలు" "అలాగే నీవు కూడా కిష్టిగా అని పిలవాలి" పెద్దోళ్ళం అయిపోయాము కనుక బుచ్చి, కృష్ణ అని పిలుచుకోవాలనే ఒప్పందానికొచ్చేం. "నిన్నెప్పుడూ యిక్కడ చూడలేదు, ఎంతైనా డాక్టరువి కదా, నీ పేరైనా వినలేదు, యింత హటాత్తుగా యిక్కడెలా ప్రత్యక్షమయ్యావు" "ద్రాక్షారంలో సొంత హాస్పిటలు నడిపేవాడినిలే. కారణాంతరాల వల్ల యిక్కడ మిషనరీ హాస్పిటల్లో చేరాను. ఇంతకీ నీవెప్పటినుంచిక్కడుంటున్నావ్"