
BRAHMAJAALA SUKTHAM
₹30
In stock · 7 available
PublisherEMANI SIVANAGIREDDY
LanguageTelugu
మనవి మాటలు బుద్ధుని ప్రవచనాలన్నింటిలోనూ, తలమానికంగా పేర్కొనబడిన, దీర్ఘనికాయంలోని మొదటి సూత్రమే బ్రహ్మజాల సుత్తం. 'ఆత్మ' 'లోకం' అన్న రెండు ప్రధానాంశాల చుట్టూ అల్లుకొన్న 62 మిథ్యాదృష్టుల గురించి, బుద్ధుడు ఈ సూత్రంలో వివరించాడు. బుద్ధుని ప్రవచనాలన్నింటికీ ఈ సూత్రం ప్రధాన భూమికగా నిలిచింది. దు:ఖ నిరోథ మార్గమైన ఆర్య అష్టాంగ మార్గంలోని మొదటి అంశమైన 'సంయక్ దృష్టి' ని అలవరచుకోవటానికి బుద్ధుడు ఈ సూత్రాన్ని ప్రవచించాడు. బుద్ధుడు కనుగొన్న 'ధమ్మం', మామూలు జనం 62 రకాల మిథ్యా దృష్టుల వలలో చిక్కుకోకుండా, కాపాడుతుంది. ఈ బ్రహ్మజాలసూత్రం, బౌద్ధ థృక్పధానికి, ఇతర తైర్థికుల ధృక్పథాలకూ గల భేదాన్ని కళ్లముందు కట్టినట్లుగా విడమరచి చెబుతుంది. ఈ సూత్రాన్ని పాళీనుంచి అనువదించటంలో గౌ. అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారి, బుద్ధుని దీర్ఘ సంభాషణలు, మహా బోధి బుద్ధ విహార, హైదరాబాద్ వారి సుత్తపిటక: దీఘనికాయ-1 శీలస్కంధవర్గం, అనువాదకులు భిక్షు ధమ్మరక్షిత (పాళీమూలం-తెలుగు అనువాదం) గ్రంథాలు మాకెంతో ఉపయోగపడినాయి. ఈ సందర్భంగా శ్రీఅన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (బుద్ధఘోషుడు) గారికి, పూజ్యభిక్షు ధమ్మ రక్షితగారికి, బౌద్ధోపాసకులు శ్రీ చెన్నూరు ఆంజనేయరెడ్డి గారికి, శ్రీసంబటూరి వీరనారాయణ రెడ్డిగారికి, పాళీమూల పాఠాన్ని అందించిన శ్రీ దేవళ్లశంకర్ గారికి, డీ.టీ.పీ చేసిన శ్రీ మలపాక సోమయాజులు గారికి ఈ పుస్తక ప్రచురణకు ముందుకొచ్చిన దాయకులు, శ్రీసాగి కృష్ణంరాజుగారికి మా కృతజ్ఞతలు.