
BRAMA- 75
by RAMACHANDRAPURAPU PRABHAKAR RAO
₹75
In stock · 5 available
PublisherRAMACHANDRAPURAPU PRABHAKAR RAO
LanguageTelugu
భ్రమ అను పేరుతో వ్రాసిన యీ నవల గతంలో జరిగిన చరిత్రకు సంబంధించిన ఘటనలలో ఒకటి. ఈ కథ 19వ శతాబ్దపు చివర భాగం మొదలుకొని 20వ శతాబ్దంలో కొంత భాగం వరకు జరిగిన యదార్థ ఘటనల సమాహారం. ఒక పల్లెటూరి పడుచు ఒక జమీందారు ఎస్టేటులో దాసిగా పనిచేస్తూ ఆ జమీందారు కుమారుని మోహించి, తిరిగి తను ప్రేమించిన ఆ యువరాజును పొందలేక తన వలపు కోర్కెలు తీరని పగతో అతని కుమారుడైన పసివాడ్ని అపహరించి అక్కడ్నుంచి పరారౌతుంది. ఈ సత్యాన్ని దాచిపెట్టి ఇంకో సంస్థానంలోకి ప్రవేశించి, వారి శరణులో అక్కడ నివాశ మేర్పరుచుకుంటుంది. ఆ తరువాత ఆ బాలుని అపురూపంగా పెంచి, పెద్దవాడ్ని చేసి విద్యావంతునిగా మున్ముందు తనకు ఆసరగా వుండేటట్టు తయారుచేసుకుందామని గంపెడాశ పెట్టుకుంటుంది. కాని ఆమె తలపెట్టిన యీ భ్రమ ఏ విధంగా మారి. ఆ కుర్రవాని జీవితం ఎన్నెన్ని మార్పులతో ఎక్కడ సమాప్తమైందీ యీ నవలలో క్లుప్తంగా వివరించడమైంది. ఈ యదార్థ కథను కొన్ని మార్పులతో సత్యానికి దగ్గరగా వ్రాయడానికి ప్రయత్నం జరిగిందేకాని, ఇది పూర్తైన ప్రమాణం కాదని నా మనవి.