BUCCHIBABU NATIKALU by ANDHRAPRADESH RASTRA SRUJANATMAKATA SAMSKRUTHI SAMITI Telugu book cover

BUCCHIBABU NATIKALU

by ANDHRAPRADESH RASTRA SRUJANATMAKATA SAMSKRUTHI SAMITI

₹300
In stock · 13 available
PublisherANDHRAPRADESH RASTRA SRUJANATMAKATA SAMSKRUTHI SAMITI
LanguageTelugu
యాత్ర ముగించుకునని పవ్వళించిన సౌందర్యం బుచ్చిబాబు సాహిత్యం “ఓ శరదిందు సుందర మహోజ్వల మౌన మనోజ్ఞ మంజులా దేశ గభీరమూర్తి! అటు దేహళి చేరువ నిల్చి దివ్య సం దేశము లీ దలంతువొ? స్వదేశమునందు! పవిత్ర ధర్మత ట్టాశ్రయమే వలంతువొ? నిరంతర విశ్వజనీన సత్యమున్” ఈ పద్యంలో చెప్పిన శరదిందు సుందరత్వం, మహోజ్వల మౌనం, గభీర మూర్తిత్వం, దివ్యసందేశాన్నిచ్చే మూర్తిమత్వం, పవిత్ర ధర్మత, నిరంతర విశ్వజనీన సత్యం అక్షరాల శ్రీ బుచ్చిబాబు రచనల్లో మనకు దర్శనమిస్తుంటాయి. ఇంకా కొన్ని తరాల తరువాత రావలసిన సాహిత్య ధోరణిని శ్రీ బుచ్చిబాబు అరవై యేళ్ళక్రితమే తెలుగు సాహిత్యంలోకి తెచ్చి చూపించాడు. ఆధునిక తెలుగు కథలో స్మృతి ప్రవాహాన్ని అనుసృజించిన మహనీయ కథామూర్తి శ్రీ బుచ్చిబాబు. వారి జీవన రేఖలను, వారి 12 నాటికలను సంపుటాలుగా తీసుకురావటానికి ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సన్నద్ధం కావటం ఒక విశేషం. తెలుగు సాహితీ మూర్తుల, కళామూర్తుల, సమాజాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్న సౌజన్య మూర్తుల గొప్ప కృషిని ఈ విధంగా పదిలపరచాలనే సంకల్పం గొప్పది. ఈ పుస్తకాలు ఆ యా వ్యక్తులకు జాతి ఇవ్వగలిగిన గొప్ప నివాళి. శ్రీ బుచ్చిబాబు (జూన్ 14, 1916 సెప్టెంబర్ 20, 1967) అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. కథకుడుగా, నవలాకారుడిగా, నాటకకర్తగా తెలుగు సాహిత్య శకటాన్ని కొత్తమలుపుల్లోకి నడిపించాడు.