
BUCHI BABU KATHALU 2
by BUCHI BABU
₹500
In stock · 486 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రచయిత పరిచయం శివరాజు వెంకట సుబ్బారావు. కలం పేరు “బుచ్చిబాబు”. వీరు 1916 జూన్ 14న జన్మించారు. వీరు ఎం.ఎ. తరువాత బి.ఎన్.ఎస్. పరీక్షకు చదివారు. తండ్రి ఉద్యోగరీత్యా పలు జిల్లాలలో పర్యటించవలసిన రావటం వలన ఆయనతో పాటు వీరు కూడా తిరిగి నిసర్గ రమణీయ గ్రామీణ ప్రకృతిని సందర్శించడంతో వీరి ప్రకృతి సౌందర్య పిపాస విస్తృతమైంది. విద్యార్థిదశ ముగిసినప్పటికి వీరు ప్రాక్, పశ్చిమ (ముఖ్యంగా ఆంగ్ల, ఇతర) వాజ్మయాలు, తత్త్వ మానస శాస్త్రాలను తృప్తితీరా అధ్యయనం చేశారు. ఈ అన్ని లలితకళల పట్లగాని ప్రకృతిపట్లగాని చేశారు. వివిధ రంగాలలో వీరు పరిచితులయ్యారు. వీరి రచనా జీవితం 30 ఏళ్లు (1936–67) విస్తరించింది. తన ఇంగ్లీష్ కలానికి “సంతోష్ కుమార్” అనీ, తెలుగు రచనలకు “బుచ్చిబాబు” అని కలం పేరు పెట్టి వీరు గ్రంథరచన చేశారు. బి.ఎ. విద్యార్థిగా ఉన్నప్పుడే ఎ.సి. కాలేజీ (గుంటూరు) వార్షిక సాహిత్య సంచికలో (1936) వీరి ప్రథమ రచనలు ప్రచురితం అయ్యాయి. మొత్తం 82 కథలు, నవల, వచనకావ్యం, 40 వ్యాసాలు, 40 నాటిక–నాటకాలు, పరామర్శ గ్రంథం, స్వీయచరిత్ర మొదలైన భాగం, కొన్ని పీఠికలు, పరిచయాలు వీరి చేతిని నుండి వెలువడ్డాయి. కాల్పనికవాద ధోరణి నుండి అనుభూతాత్మక కథా కథన ధోరణికి ఒక కొత్త మలుపును కానిచ్చిన తెలుగు నవకథా రచయితలలో ప్రముఖులు. కొందరి దృష్టిలో క్రీడాశీలవాది, ఆరాధవి, సౌందర్యారాధనం, మనస్తత్వవాదం సంగమించిన తత్వాలు వీరి కథలు. “మానవునికి జీవితంతో సమాధానపడటం తప్పదేమో” అనే సందేశం, సంకేతం వీరి కథారచనలలో ధ్వనిస్తుంది. వీరి వ్యాసాలలో జ్ఞానతృష్ణ, విశేష కళానిపుణత ఉంది. నాటకాలలో నాటక రచనా పాటవం ప్రస్ఫుటమై ఉంటుంది. వీరు 1967లో పరమపదించారు. వీరి భార్య ప్రముఖ రచయిత్రి శ్రీమతి సుబ్బలక్ష్మిగారు తీరిక సమయాలలో పెయింటింగ్ వేయడం, తమ సృజనాత్మక రచనలు చేసేవారు. వీరు 6-2-2021న బెంగళూరులో కన్నుమూశారు.