
BUDDAYANAM REKKALU
₹120
In stock · 39 available
PublisherDR.GUDISEVA VISHNU PRASAD
LanguageTelugu
జీవితాన్ని చిత్రీకరించిన 'బుద్ధయానం' సుదూరంగా - ఎక్కడో, ఏ చెట్టుమీదనో కొమ్మల మధ్య కూర్చొని కోయిల కూస్తోంది. తియ్యగా.. తియతియ్యగా కోయిల ఏ భాషలో కూస్తోంది? పేరు చెప్పలేం కాని ఆ కూతను మనం పాటగా అనువదించుకుంటాం-ఇది ప్రకృతితో, మనిషికి ఉన్న అనిర్వచనీయమైన బంధం. రెక్కలు కూడా అంతే. ఒక శ్వాసగా పాఠకుడిలోకి వచ్చి చేరతాయి. అనేక భావాలుగా ప్రవహిస్తాయి. తేలిగ్గా-రెక్కను ఇలా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక దృశ్యం, లేదా సంఘటన చూస్తున్నపుడు కలిగే తొలి భావం, ఆ తర్వాత వెంటనే స్ఫురించే మలిభావంలో తేడా ఉంటుంది. తొలి భావం విషయమైతే, మలిభావం వ్యాఖ్య అదే రెక్క ఇంటికి చుట్టాలొచ్చారు - "మా ఇంటికి చుట్టాలొస్తుంటారు పనిమీద చూసి పోవడానికి" - ఇది తొలి భావం. ఆ తర్వాత - మలిభావం వ్యక్తమవుతుంది. కవి ఏమైనా చెప్పొచ్చు. ఇక్కడ కవి పాజిటివ్ గా ఇలా అంటున్నాడు 'పలకరింపే పరమౌషధం' నిర్మాణం. అలా రెక్క సాంద్రమవుతుంది. సత్యమవుతుంది. తత్త్వమవుతుంది. ఇది రెక్కల ఇక విష్ణు ప్రసాద్ గారి రెక్కల దగ్గరికొస్తాను ఈ రెక్కల సంపుటి పేరు బుద్ధయానం ! ఏ బుద్ధుని యానం ? విజ్ఞుడైన వాడు బుద్ధుడు. ఎవరా బుద్ధుడు ? ఎదురుగా ఉన్న బుద్ధుడే. తెలుగు సాహిత్య తీర రేఖగా ప్రసిద్ధుడైన మన మండలి బుద్ధ ప్రసాద్ గారే !