BUDDHA JEEVITHA SANGRAHAM - 50.00 by DR.DASARATHI RANGACHARYA Telugu book cover

BUDDHA JEEVITHA SANGRAHAM - 50.00

by DR.DASARATHI RANGACHARYA

₹50
In stock · 853 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రచయిత పరిచయం కలియుగం ప్రారంభమై 5108 సంవత్సరాలు. ఇంతవరకూ ఎవరూ వేదాలను సామాన్య ప్రజలకు అందించాలని సంకల్పించలేదు. 'ప్రజలకు వేదం' అనే నినాదంతో సాహసించిన అద్వితీయుడు అక్షరవాచస్పతి. సాంప్రదాయపు సంకెళ్ళను తెంచి నాలుగు వేదాలను తెలుగు వెన్నెల వచనంలో అనుసృజించిన ఆద్యుడు దాశరథి రంగాచార్య. రెండు ఇంకనూ రెండు బ్రాహ్మణాలు పది ఉపనిషత్తులు రామాయణాలు భారతం- హరివంశం భాగవతం సవ్యాఖ్యానంగా అనుసృజించిన అక్షరశిల్పి రంగాచార్య. వీరి వచనం వెన్నెలవాగు. సులభం– సుందరం, అక్షర దృశ్యాలు దర్శింపచేస్తుంది. దాశరథి రంగాచార్య 12 ఏండ్ల వయసులోనే ప్రజా పోరాటాలకు అంకితం అయినారు. 1946 - 51 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధుడు. తెలంగాణ జీవితాన్ని తొమ్మిది నవలల్లోనూ, జీవనయానం ఆత్మకథలోనూ అక్షర రూపంలో అమృతీకరించారు. వీరి రచనలు కొన్ని చలన చిత్రాలుగా కూడా వచ్చాయి. సంస్కృతం, తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో సన్నిహిత పరిచయం గల అక్షరవాచస్పతి అన్ని భాషల నుండి అనుసృజించారు. సాహిత్య ప్రక్రియలన్నింటిలో వీరి ముద్ర కనిపిస్తుంది. దాపరికంలేని నిరాడంబర జీవితం, అక్షరమే వారి సంపద. దాశరథి రంగాచార్య ఇప్పటికి 16,000 అచ్చుపుటల 73 గ్రంథాలు రచించారు. సంప్రదాయం పునాదులమీద ఆకాశమంత ఎత్తుగా ఎదిగిన అభ్యుదయ సారస్వత గోపురం, అక్షరవాచస్పతి డా॥ దాశరథి రంగాచార్య సాహితీ ప్రస్థానం -విప్లవం నుంచి వేదం వరకు సాగుతున్నది. ॥ అసతోమా సద్గమయా || విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004