BUDDHADHATHU PETIKALU by DR.EMANI SIVANAGIREDDY STHAPATI Telugu book cover

BUDDHADHATHU PETIKALU

by DR.EMANI SIVANAGIREDDY STHAPATI

₹100
In stock · 64 available
PublisherDR.EMANI SIVANAGIREDDY STHAPATI
LanguageTelugu
తెలుగునేలపై బౌద్ధం బుద్ధుని జీవితకాలంలోనే, బుద్ధుని ధమ్మం తెలుగు నేలపై ప్రసరించిందని సుత్తనిపాతంలోని 'పారాయణవగ్గ'లోని బావరి, అతని శిష్యుల కధవల్ల తెలుస్తుంది. బౌద్ధమత శాఖలైన ధేరవాద, మహాయాన, వజ్రయానాలు తెలుగువారి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో తమ ప్రభావాన్ని చూపాయి. వంశధార, గోస్తని, తాండవ, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, బాహుద మొదలైన నదీ పరీవాహక ప్రాంతాలలోనూ, ఉత్తర తీరప్రాంతంలో ఉన్న చదునైన కొండచరియలపైనా మౌర్యుల (క్రీ.పూ 4-3 శతాబ్దాలు) నుండి విష్ణుకుండినుల (క్రీ.శ 5-6 శతాబ్దాలు) కాలందాకా విలసిల్లిన అనేక బౌద్ధక్షేత్రాలు వెలుగులోకి రావటమే ఇందుకు నిదర్శనంగా చెప్పకోవచ్చు. బౌద్ధక్షేత్రాలు ఎక్కువగా తీరాంధ్ర దేశంలోనూ, తెలంగాణా పీఠభూమిలోనూ, ఉండగా రాయలసీమలో కేవలం కడప జిల్లాలోని నందలూరు', తాళ్ళపాక, పుష్పగిరి, అనంతపురం జిల్లాలోని సాసనకోట అనే చోట్ల మాత్రమే గుర్తించటం జరిగింది. రాయలసీమ ప్రాంతం అంతా కొండలతో నిండి ఉండటం, నదులు ఎక్కువగా తెలుగునేలపై బౌద్ధ స్థలాలు