
BUDDHI JEEVI
₹75
In stock · 330 available
PublisherMYNAMPATI BHASKAR
LanguageTelugu
బుద్ధిజీవి ఇప్పటికి రెండు తరాల తర్వాత ఆ రోజు కూడా అలవాటుగానే సూర్యుడు ఉదయించాడు. అతి మామూలుగానే తెల్లవారింది. అంత సాధారణంగా ఉన్న ఆ రోజున, అసాధారణమైన సంఘటనలు మూడు - ఒకదాన్ని ఒకటి తరుముకొస్తున్నట్లు, వెంట వెంటనే జరుగుతాయని ఊహించలేకపోయింది అపురూప, "2053 వ సంవత్సరం మే ఏడవతారీఖు చదువుతున్నది..." అని వినబడుతోంది టీవీలో. వార్తలు వెచ్చటి సువాసనలు వెదజల్లుతున్న బ్లాక్ కాఫీ కప్పు చేతిలో పట్టుకుని టీవీముందు కూర్చున్న అపురూప నుదురు చిట్లించి ఛానెల్ మార్చింది. ఎవరో వార్తలు చదువుతుంటే వినడం బోరు ఆ అమ్మాయికి. తను చదవడమే ఎక్కువ ఇష్టం. ఛానెల్ మార్చగానే, ప్రకాశవంతంగా ఉన్న టీవీ స్క్రీన్ అక్షరాలతో వార్తాపత్రికలా కనబడటం మొదలెట్టింది. అక్షరాలు నెమ్మదిగా పైకి జరిగిపోతున్నాయి. శీర్షికలు మాత్రం చదువుతోంది అపురూప.