BUDDUNI MADHYAMA SAMBHASHANA 2 by ANNAPAREDDY BUDDA GHOSHUDU Telugu book cover

BUDDUNI MADHYAMA SAMBHASHANA 2

by ANNAPAREDDY BUDDA GHOSHUDU

₹200
In stock · 6 available
PublisherANNAPAREDDY BUDDA GHOSHUDU
LanguageTelugu
భారత దేశంలో బౌద్ధపునరుద్ధానం, 1891లో శ్రీలంక బౌద్ధ భిక్షువు అనగారిక ధర్మపాల భారత దేశానికి వచ్చి మహా బోధి సొసైటీని స్దాపించడంతో ఆరంభమై, అదే సంవత్సరం జన్మించిన డా. అంబేద్కర్ 1956లో తాను బుద్ధుని శరణుజొచ్చి, తన అనుయాయు లందరిని అదే మార్గాన్ని అవలంబించ వలసిందిగా "తూర్యనాదపు పిలుపు" (Clarian Call) ఇవ్వడంతో పరాకాష్ఠ చేరింది. అనగారిక ధర్మపాల 1864 సెప్టెంబరు 17వ తేదీన శ్రీలంకలో బౌద్ధ కుటుంబములో జన్మించాడు. నాటి ఆచారం ప్రకారం, బౌద్ధ కుటుంబములో జన్మించినా, క్రైస్తవ దేవాలయాలు వారి పేర్లలో క్రైస్తవ నామాన్ని చేర్చేవి. ఫలితంగా అతని పేరు డేవిడ్ హేవవితరణ అయింది. అతడు 1891లో, సిద్ధార్ధుడు బుద్దుడైన బోధగయకు వచ్చి, బుద్ధుని వజ్రాసనం మీద తల ఆనించడంతో అతనికి బోధి కలగింది. ఇక మరి అతడు వెనుతిరిగి చూడలేదు. బ్రాహ్మణ మహంతుల అధీనంలో ఉన్న బోధగయ ఆలయాన్ని బౌద్ధుల అధీనంలోకి తేవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించి యుద్ధం చేశాడు, కాని ఆ ఆలయం నేటికీ పూర్తిగా బౌద్ధుల చేతిలోకి రాలేదు. బౌద్ధ దూత్యం నెరపిన వారిలోకెల్ల అగ్రగణ్యుడాతడు. ఆధునిక కాలంలో ఈ ప్రపంచంలోను, భారత దేశంలోను బౌద్ధ ప్రాచుర్యానికి కృషిచేసిన అందరిలోకి ఆద్యుడు, బాధ్యుడు అయినవాడు అతడే. ఈ బౌద్ధ పునరుద్ధాన కొనసాగింపులో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మంగళగిరి బుద్ధవిహార ట్రస్టుతో సహా ఆంధ్రప్రదేశంలోని దాదాపు అన్ని బౌద్ధ సంఘాలు, విహారాలు, అభిమానులు, ఆంధ్రప్రదేశ్ బౌద్ధ మహా సమ్మేళనం పేర ఒకే గొడుగు క్రింద ఏకీకృతమై బౌద్ధ వ్యాప్తికి విశేషంగా కృషిచేస్తున్నాయి. ఈ కృషిలో భాగంగా అన్నపరెడ్డి బుద్ధఘోషుడు మూల పాళీ బౌద్ధ పిటక సాహిత్యాన్ని తెలుగువారికి అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన పిటక సాహిత్యంలోని దీఘనికాయాన్ని'బుద్ధుని దీర్ఘసంభాషణలు' పేరుతో, సుత్తనిపాతాన్ని 'బుద్దుని సూత్ర సముచ్చయం' పేరుతో, మజ్జిమ నికాయ ప్రధమ భాగాన్ని బుద్ధుని మధ్యమ సంభాషణలు-1గా అందించారు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ గ్రంథం 'బుద్ధుని మధ్యమ సంభాషణలు-2' (మజ్జిమ నికాయ ద్వితీయ భాగానువాదం). ఇవిగాక అత్యంత ప్రాముఖ్యం కలిగిన 'బుద్దదర్శనం', 'బుద్దుని మార్గం', 'నేటి ప్రపంచానికి బౌద్ధం', 'ఆచార్య నాగార్జునుడు', 'మానవీయ బుద్ధ', 'మాహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు' మొదలైన వీరి గ్రంథాలను తెలుగు బౌద్ధాభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు.