
BULUSU SUBRAHMANYAM KATHALU
₹150
In stock · 40 available
PublisherBULUSU SUBRAHMANYAM
LanguageTelugu
నా మాట నవ్వితే నవ్వండి అన్నది (http://bulususubrahmanyam.blogspot.in) నా బ్లాగు పేరు. అందులోని కొన్ని టపాలు (బ్లాగు పోస్ట్సు), నాకు నచ్చినవి, ఎక్కువ మంది బ్లాగు పాఠకులు చదివినవి, ఈ పుస్తకంలో ఉన్నాయి. నవ్వాలని రూలు లేదు. పాఠకుడి ఇష్టం. నవ్విపోయినా అభ్యంతరం లేదు. ఇందులో చాలా మట్టుకు కధలు ఉన్నాయి. కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి, అంటే కధలు కానివి. నా బ్లాగు చదివిన అంతర్జాల పాఠకులు చాలామంది నవ్వుకున్నామని అన్నారు. “అబ్బే, అసలు నవ్వు రాలేదు, మీరు ఎందుకు వ్రాస్తున్నారు?” అని కోప్పడ్డవారూ ఉన్నారు. నేను అంతర్జాలంలో బ్లాగులో కధలు, కాకరకాయలు వ్రాస్తానని మా బంధు మిత్రుల్లో చాలామందికి తెలియదు. తెలిసినా కంప్యూటరు ముందు కూర్చుని చదివే ఓపిక (తీరుబడి) లేని వాళ్ళు కూడా ఉన్నారు. వారిచేత చదివించాలనే కోరికకి తోడు ప్రింటులో పేరు చూసుకోవాలనే దుర్బుద్ధి, నన్ను ఈ పుస్తక ప్రచురణకి పురిగొల్పింది. ఇందులో రచనలు చదివి కనీసం కొంతమందైనా నవ్వుకుంటే నా ప్రయత్నం సఫలీకృతమైనట్టు భావిస్తాను. చిన్నప్పుడు, పెద్దైన తరువాత చేసే ఉద్యోగాల గురించి చాలా కలలే కన్నాను. కానీ అందులో రచయిత లేడు. పెద్దైన తరువాత కూడా ఎప్పుడూ రచయిత అవ్వాలని అనుకోలేదు.