
BURRAKOKA BUDDI
₹30
In stock · 726 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సున్నపు కాయ శ్రీపురంలో చెన్నకేశవస్వామి అనే ధనికుడున్నాడు ఆయన భార్య మంగళాంబ స్వపర భేదాలు లేకుండా అందరినీ ప్రేమగా ఆదరిస్తుంది. ఆ దంపతులు కూతురికి పెళ్ళి చేశారు. ఇక ఉన్నది కొడుకు రంగబాబు. అతడు సుగంధ ద్రవ్యాల వ్యాపారం పేరు చెప్పి దూర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. శంభునాదం, చెన్నకేశవస్వామి పొరుగునే ఉంటున్నాడు. ఆయన ఒకప్పుడు బాగా దొంగతనాలు చేసి డబ్బు ఆర్జించాడు. అయితే ఆయన భార్యకూ, కొడుకు శ్రీచందుకూ కూడా ఆ వృత్తి నచ్చలేదు. వాళ్ళ బలవంతం మీద ఆయన తన డబ్బునంతా తెచ్చి శ్రీపురం చేరుకున్నాడు. శ్రీచందు కూడా సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడు. ఒకసారి రంగబాబు శ్రీచందు కలసి వ్యాపార నిమిత్తం మలయదేశం బయలుదేరారు. మంగళాంబకు గుండె గుభీల్మంది. అక్కడికి వెడితే తిరిగి రావడానికి ఏడాది పడుతుంది. ప్రయాణం ప్రాణప్రమాదంతో కూడుకున్నది. రంగబాబు తల్లికి తన గుర్తుగా వ్రేలికున్న బంగారు ఉంగరం తీసి ఇచ్చి బాగా ధైర్యం చెప్పి వెళ్ళాడు.