BUVVA - BANGARRAJU KANTA by BANGARRAJU KANTA Telugu book cover

BUVVA - BANGARRAJU KANTA

by BANGARRAJU KANTA

₹100
In stock · 43 available
PublisherBANGARRAJU KANTA
LanguageTelugu
కవి మాట ముందుగా నాకు ఈ జన్మను ప్రసాదించిన నా తల్లిదండ్రులను స్మరించు కుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకునే సందర్భం రాదు. ఇప్పుడు నాకు వచ్చింది. ఈ జీవితం వారు పెట్టిన భిక్ష వారు కన్న కల ఎంతరకు నెరవేర్చానో ఎప్పుడూ సరిచూసుకోలేదు. అదేవిధంగా ఇంకో నలుగురు వ్యక్తుల్ని ప్రస్తావించాలి. ఆ నలుగురూ నాలుగు స్తంభాలు. బాల్యం నుండి ఇప్పటివరకు చెట్టాపట్టాలేసుకుని సాగుతున్నాం. వాళ్లే నా స్నేహితులు శ్రీధర్, సాయిరాజు, వెంకట్లు మూడు స్తంభాలైతే, ఉద్యోగం మొదటి మలుపులో కలిసిన మరో స్నేహితుడు సత్యనారాయణ. వీళ్ళతో నా స్నేహానికి దిష్టి తగలకుండా వుండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే నా సాహితీ ప్రయాణంలో మరచిపోలేని వ్యక్తులు నాకు గురువర్యులు. పితృసమానులు ప్రముఖ కవులు రసరాజు గారు, ఎస్.ఆర్. భల్లం గార్లు. నా కవిత్వం వాళ్ళు చెక్కిన శిల్పం. వాళ్ళు లేకుండా నా కవిత్వ ప్రస్థానమే లేదు. ఈ సందర్భంగా ఇంకో వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఆయనే బిక్కి కృష్ణ గారు. జంఝామారుతంలా నా సాహితీ జీవితంలో ప్రవేశించారు. ఇక పరుగో పరుగు. ఇన్నాళ్ళకి నాకు సరైన కోచ్ దొరికినట్లయింది. ఆయన మాట నాకు వెయ్యి ఏనుగుల బలమై నన్ను నడి పిస్తుంది. వారికి నా ధన్యవాదాలు. అలాగే ముందుమాటతో ఈ పుస్తకానికి మెరుగులద్దిన ఆంధ్రప్రభ సంపాదకులు వైయస్సార్ శర్మ గారికి, 2014 నంది అవార్డు గ్రహీత, ప్రముఖ నవలా రచయిత, సినీ దర్శకులు ప్రభాకర్ జైనీ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక నా కవిత్వం విషయానికొస్తే నేనేమీ సాహిత్యాన్ని ఔపోసన పట్టలేదు.