BYRON by VALLABHANENI ASHWINI KUMAR Telugu book cover

BYRON

by VALLABHANENI ASHWINI KUMAR

₹333
In stock · 19 available
PublisherKALA JYOTHI PROCESS PVT.LTD
LanguageTelugu
ISBN9788192717067
బైర్రన్ నైతిక జీవనానికి మత విశ్వాసంతో పనిలేదని, దైవచింతన అవసరం లేదని నమ్మిన పి.బి. షెల్లీని నాటి సమాజం నిరసించింది. దేశం వెలివేసింది. చివరికి కాందిశీకునిగా ఇటలీ పర్వత సానువుల్లో సముద్ర తీరాల వెంట పయనించి ఆ కవి, స్వాప్నికుడు, సాహసి మూడుపదులు నిండకనే మున్నీటపాలయ్యాడు. అతనికి సమకాలీకుడు - బైరన్, మతవిశ్వాసాల మధ్య పెరిగినా, మనిషి దుఃఖానికి దేవుడే కారణమని అతనంటూవుంటే నమ్మి భౌతిక సుఖాల వేటలో నైతిక సూత్రాలను కూడా శృంఖలాలుగానే భావించి స్వేచ్ఛాజీవిగా బ్రతకటానికి సాహసించాడు. అతన్ని, తానున్న లండన్ సమాజం విమర్శలతో వెక్కిరించింది. అసూయతో అందలమెక్కించి తీరాలను దాటించింది. స్వయంగా గ్రీకు చరిత్ర, లాటిన్, జర్మన్, ఇటాలియన్, గ్రీసు బాషలు నేర్చాడు. ఎన్నో గ్రంథాలు చదివాడు. బైబిల్ లోతుపాతులు చూశాడు. తనలోని సంఘర్షణకు కవితారూపం ఇవ్వటం మొదలుపెట్టాడు. తన జీవితంలో సగభాగం పైగా కాందిశీకునిగా ఇటలీ, గ్రీకు ద్వీపాలలో గడిపాడు. ఎన్నో సాహసయాత్రలు చేశాడు అద్భుతమైన కవితా ఖండికలు దీర్ఘ కవితలు శ్రావ్యంగా గానంజేశాడు. మనిషి స్వేచ్ఛకోసం సమాజంతో పోరాడి పోరాడి అలసిపోయాడు. అతని జీవితాన్ని ఏ సూత్రాలతో కొలవాలి, నైతికతా, మతవిశ్వాసమా? లేక దేవుని పది ఆదేశాలతోనా? చివరికి ఎక్కడ తేలాడు? తన వనరులన్నీ అవసరంలో వున్నవారికే ఉపయోగించాడు. పరాయి దేశమైన గ్రీసుని - టర్కీల కోరల్నుంచి రక్షించాలని తన శక్తినీ, సమయాన్నీ, ధనాన్నీ వెచ్చించి చివరికి తన ముప్పయి ఆరవ ఏడు నిండకుండానే తనూ ఖర్చయిపోయాడు. షెల్లీ మనలో ఆదర్శాలు, ఆశయాలకు ప్రతిరూపం. బైరన్ మనలోని బలహీనతలకు, బలమైన వాంఛలకు విచిత్ర రూపం.