
C. RAGHAVACHARI GARI SAMPADAKEEYA SAILI ANUSEELANA
₹100
In stock · 58 available
PublisherSMT.KOMANDURI KRISHNA
LanguageTelugu
మొదటి అధ్యాయము పరిచయము - వ్యక్తిత్వము 1.1.0. ఉపోద్ఘాతం: లోకంలో విద్యావంతులకు పత్రికా పఠనంతోనే ప్రాతఃకాల కార్య క్రమాలు ప్రారంభమవడం సర్వసాధారణం. పత్రికలు వార్తలద్వారా, వ్యాఖ్యానాలద్వారా సమా చారాన్ని అందిస్తూ పాఠకులలో సామాజిక స్పృహను పెంచుతున్నాయి. కేవలం ఆరోజు వార్తలనే కాక తమ ఉత్తమ ఎడిటోరియల్స్ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైజ్ఞానిక... ఎన్నో అంశాలతో విశ్లేషణాత్మక, వివరణాత్మక, సందేశాత్మక వ్యాసాలతో అతి సాధారణ వ్యక్తిని సైతం జాగృతం చేస్తూ విలసిల్లుతున్న విజ్ఞాన సర్వస్వాలు నేటి పత్రికలు అన్నది జగద్విదిత విషయం. అలనాటి వార్తాహరులనుండి నేటి ప్రధాన సంపాదకుని వరకు అంచెలంచెలుగా వార్త లక్ష్యము, లక్షణము మారుతూ వచ్చింది. దాని నేటి రూపమే జర్నలిజం. ఎందరో విజ్ఞాన ఖనుల, అన్వేషకుల, తాత్త్వికుల, మేధావుల, రచయితల సమిష్టి కృషితోనే నేటి పత్రికలు సర్వాంగసుందరంగా, విద్యా వైజ్ఞానిక సాంకేతిక శక్తికి ప్రతిరూపాలుగా అలరారుతున్నాయి. సంపాదక ప్రముఖులు: పత్రికలు సమాజాన్ని చైతన్యవంతంగా మారుస్తూ సమకాలిక సమస్యల పట్ల అవగాహన కలిగిస్తూ తమ ఔన్నత్యాన్ని దిన దిన ప్రవర్ధమానం కావించుకోవటంలో సంపాదకుల పాత్ర అమోఘము. అందునా స్వాతంత్య్ర సముపార్జనకు ముందు నుండి సమాజాన్ని చైతన్యవంతం చేసిన ప్రముఖుల పాత్ర అనిర్వచనీయం. తమ సంపాదకీయాల ద్వారా స్వాతంత్య్ర సముపార్జనకే కాక తర్వాత కాలంలోను ప్రజలను చైతన్యవంతులను చేసిన సంపాదక ప్రముఖులుగా ఎన్నతగినవారు. కందుకూరి వీరేశలింగం గారు, చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, గిడుగు రామమూర్తిగారు, కొమర్రాజు లక్ష్మణరావుగారు, సురవరం ప్రతాపరెడ్డిగారు, దేవులపల్లి రామానుజరావుగారు, కాశీనాధుని నాగేశ్వరరావుగారు. మనరాష్ట్రంలో అట్టి ప్రముఖ సంపాదకులలో నార్ల వెంకటేశ్వరరావు గారు, గోరాశాస్త్రిగారు, పండితారాధ్యుల నాగేశ్వరరావుగారు, ముట్నూరి కృష్ణారావుగారు, త్రివేణి, కొలవెన్ను రామకోటేశ్వరరావుగారు ప్రముఖులు కాగా, నేటి సంపాదకులలో పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, నండూరి రామమోహనరావుగారు, సంపత్గారు, ఏవిఎస్, ఎ.బి.కె. జాతీయస్థాయిలో ఇంగ్లీషు పత్రికారంగంలో ప్రముఖులైన సర్ సి.వై. చింతామణిగారు, ఎం. చలపతిరావుగారు. 1. సి. రా. - చక్రవర్తుల రాఘవాచారి.