CHAKKANI TELUGU VYASAMULU by D.BOSE & BROS book cover

CHAKKANI TELUGU VYASAMULU

by D.BOSE & BROS

₹22
In stock · 1 available
PublisherD.BOSE & BROS
LanguageTelugu
1. నూతన విద్యా విధానం (New Educational Policy) ముఖ్యాంశాలు : 1. ప్రస్థుత విద్యా విధానం - విద్యాలయాలు 2. నూతన విద్యా విధానం యొక్క లక్ష్యాలు 3. ప్రాధమిక, సెకండరీ విద్య - జాతీయ విద్యా ప్రణాళికా నమూనా 4. జనాభా విద్య 5. జాతీయ సమగ్రతా పరిరక్షణ 6. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి - ప్రభుత్వాల బాధ్యత 1. ప్రస్థుత విద్యా విధానం విద్యాలయాలు : నిశితంగా ఆలోచిస్తే మనదేశంలో జాతీయ విద్యా విధానం అంటూ ఏది లేదు. విద్య "కంకరెంట్ లిస్టు" లో ఉంది. అంటే రాష్ట్ర, కేంద్ర ఉమ్మడి జాబితాలో ఉంది. అయినా విద్యాలయాల నిర్వహణ, సిబ్బంది ఉద్యోగ నిబంధనలు, మొదలైన విషయాలన్నీ, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉన్నాయి. రాష్ట్రాల్లో విద్యా లయాలకు సరియైన భవనాలే లేవు. ఉదాహరణకి దేశంలోని 4.75 లక్షల పాఠ శాలల్లో నలభై శాతానికి ఏ మాత్రం భద్రత కల్గిన భవనాలు లేవు. ఇరవై శాతానికి పైగా వాటికి మూత్రశాలలు లేవు. గ్రామాల్లో ఉన్న 4.31 లక్షల పాఠశాలల్లో అరవై రెండు శాతం పాఠశాలలకు మంచినీటి వసతి లేదు. 2. నూతన విద్యా విధానం యొక్క లక్ష్యాలు: 'వీటినన్నిటినీ దృష్టిలో నుంచుకొని కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం రూపొందించింది. ఈ విద్యా విధానాన్ని మన పార్లమెంట్ ఆగష్టు 1986లో ఆమోదించింది. వివిధ స్థాయిల్లో వికేంద్రీకరణ పథకం నూతన విద్యా విధానం యొక్క ఊపిరి. జాతీయ సంస్కృతిని పటిష్టం చేయటమే నూతన విద్యా విధానం యొక్క ప్రాథమిక లక్ష్యం. అదీ కాక ఆధునిక యుగంలో నలుమూలలా వచ్చే మార్పుల కను గుణంగా సంఘాన్ని తీర్చిదిద్దటమే నూతన విద్యా విధానం యొక్క లక్ష్యం. ఈ విధానంలో మన సాంస్కృతిక విలువలను నిర్లక్ష్యం చేసే పని లేదు. నూతన విద్యా విధానంలో పరీక్షలకు సంబంధించిన సంస్కరణలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి. పరీక్షా విధానం "ఛాన్స్"కు తావివ్వరాదు. విద్యార్థులు కంఠస్థం చేసి నాలుగు ప్రశ్నలకు సమాధానం వ్రాసి ఉత్తీర్ణత పొందే పద్ధతి ఉండరాదు. ఎప్పటికప్పుడు విద్యార్థుల అభిరుచిని, కృషిని అంచనా వేయాలి. విద్యార్థులు కేవలం పుస్తకాలు చదవటంతోనే కాలాన్ని గడపరాదు. బోధనా పద్ధతుల్లో, బోధన కుపయోగించే సాధన సంపత్తిలో ఎప్పటికప్పుడు వినూతనమైన ఆవిష్కరణలు