CHALAM CHINTANA - 2 KALA CINEMALU by ALLA GURUPRASADARAO Telugu book cover

CHALAM CHINTANA - 2 KALA CINEMALU

by ALLA GURUPRASADARAO

₹150
In stock · 10 available
PublisherSMT.A.ARUNA CHALAM FOUNDESTIONS
LanguageTelugu
ముందుమాట చలంగారి రచనలను ఆసాంతం పరిశీలించి, పరిశోధించి ఆయన సినీమా గురించి ఎక్కడ, ఏ చిన్న ప్రస్తావన చేసినా ఏరి కూర్చిన పుస్తకం ఇది. చలంగారి పట్లా, ఆయన రచనల పట్లా ఆళ్ళ గురుప్రసాదరావుగారికీ, గాలి ఉదయకుమార్ గారికీ ఉన్న భక్తి, శ్రద్ధలకు నిదర్శనం ఈ పుస్తకం. చాలా గొప్ప కృషి. నేను గురుప్రసాదరావుగారూ దాదాపు సమ వయస్కులం. తొలి రోజుల్లో చలంగారి రచనలను కేవలం చదవడం కాకుండా ఆపోశన పట్టి, తాగేసిన చాలామందిలో మేమూ ఉన్నాం. ఒక విధంగా చలంగారి ప్రభావం ఆ రోజుల్లో చాలామంది రచయితల మీద ఉండేదని నా ఉద్దేశం. అలాగే ఆయన నిజాయితీ, నిక్కచ్చితనం, నిష్కర్షగా చెప్పిన విషయాలు, సమాజంలోని హిపోక్రసీని చీల్చి చెండాడడం, చెండాడిన పద్ధతీ ఆస్మదాదులను ముగ్దుల్ని చేశాయి. వయస్సులో ఉన్న మాలాంటి కుర్రాళ్ళకు ఆయన మ్యూజింగ్స్, ప్రేమలేఖలు దాదాపు కంఠస్థం. ఇప్పటికీ ఆ వాక్యాలు, ఆయన ఊహలు మనస్సులో యధాతథంగా కదులుతాయి. ఒక వాక్యాన్ని ఎన్నిసార్లు ఎన్ని సభల్లో చెప్పానో గుర్తు లేదు. Don't try to rekindle a cigar or a woman's heart. అయితే చలంగారి జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. ఎన్నో విపర్యయాలున్నాయి. వారి భక్తులు కూడా ఆయా దశలలో వారితో అంత సమగ్రంగా తమ అభిప్రాయాలను మార్చుకోలేక ఆగిపోయిన సందర్భాలున్నాయి - ఇప్పటికీ, ఎప్పటికీ, ఆయన్ని అర్ధం చేసుకుని దూరంనుంచి గమనించిన కొందరున్నారు.