
CHALAM SANJEEVADEV
by SMT.A.ARUNA CHALAM FOUNDESTIONS
₹150
In stock · 9 available
PublisherSMT.A.ARUNA CHALAM FOUNDESTIONS
LanguageTelugu
సంజీవదేవ్ చలం బాలబంధు బి.వి. నరసింహారావు గార్కి చలం, సంజీవదేవ్ గార్లు గురుతుల్యులు. సంజీవదేవ్క చలంగారు వ్రాసిన ఉత్తరాలన్నీ 1987 ఆగష్టు లో బాలబంధు ప్రచురణలు, రాజేంద్రనగర్, గుడివాడ వారు ప్రింటు చేయించారు. నేటి తరానికి చాలామందికి అవి తెలియదు. అలాగే చలంగార్ని గురించి రెండు పుస్తకాల్లో పీఠికలు, కొన్ని వ్యాసాలు వచ్చాయి. అవన్నీ కలిపి ప్రింటు చేయించటం చారిత్రక అవసరం అనిపించింది. నాకు కూడా వారిద్దరితో పరిచయం ఉంది. వారిద్దరి నుండి నేను ఉత్తరాలు అందుకున్నాను. వారిద్దరి విలువ కొంతైనా తెలిసినందుకు సంతోషంగా ఉంది. నా జీవితకాలంలో వారిద్దరి పరిచయం వల్ల జీవితం ధన్యమైందని సంతోషంగా ఉంది. ఇక 'చలం శత జయంతి' సమావేశాలకు నా ఆహ్వానం మేరకు ఇనగంటి నరసింహారావు (తాడికొండ) గారు సంజీవదేవ్, వావిలాల సుబ్బారావు గార్లను కొత్తగూడెం తీసుకువచ్చారు. ఆ సమావేశంలో సంజీవదేవ్ అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ పుస్తకంలో అదనంగా చేర్చినవి: 1. కీ.శే. గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి 'చలం జీవితం సాహిత్యం' అనే గ్రంథానికి పీఠిక 2. వావిలాల సుబ్బారావు గారి 'చలం గారి కథానికా సాహిత్యం-అనుశీలనము' బృహత్ గ్రంథానికి చింతాధార పేరిట 15 పేజీల సంజీవ్ దేవ్ వ్యాసం. 3. చలం శత జయంతి సందర్భంగా 'చలం శత జయంతి సంఘం' ప్రచురించిన సావనీర్ లో "చలం మాటలు” అనే వ్యాసం సంజీవదే వ్వ్రాశారు. 4. చలంగారి గీతాంజలికి సంజీవదేవ్ వ్రాసిన పీఠికను క్లుప్తంగా 5. ఎస్. ఎస్. లక్ష్మి రచించిన 'చలం సాహిత్యావలోకనం' (రాజా ప్రచురణలు, విజయవాడ) నుంచి డాక్టర్ సంజీవదేవ్ రచించిన 'చర్చ' ను కూడ ఈ పుస్తకంలోకి చేర్చాము. * ఈ పుస్తకంలోని ప్రతి వాక్యం, మాట విలువైనవి. ఈ పుస్తక ప్రచురణకు సహకారం అందించిన వికాస ధాత్రి (డిజిటల్ లైబ్రరీ) వ్యవస్థాపకులు, స్కూల్ రేడియో నిర్వాహకులు అయిన శ్రీ గాలి ఉదయ గారికి నా కృతజ్ఞతలు.