
CHALANAM
₹300
In stock · 19 available
PublisherYAKKALURI SRIRAMULU
LanguageTelugu
Chalanam 'చలనం'లోని కథలన్నీ మనల్ని చలింపచేస్తాయ్ ఏకబిగిన మనల్ని ఏడు కథలు చదివింప చేస్తాయ్ తీయని అనుభూతుల్నేకాదు ఏడుపునూ తెప్పిస్తాయ్ మింగుడుపడని జీవిత సత్యాలను మన ముందు పరుస్తాయ్ జవాబుల్లేని ప్రశ్నలతో మన ఎదుట మనల్నే నిలదీస్తాయ్ కథలను నడిపిన తీరు కథాగమనం, కథనం ప్రతి పాఠకున్ని అనేకానేక ఆలోచనల పరంపరల్లోకి లాక్కెళ్తాయ్ కథలన్నీ వాస్తవాలేనన్నంతగా అబ్బురపరుస్తాయ్ జీవితాలు ఇలా కూడా ఉంటాయా? మనుషులు ఇంతటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అనే ఆవేదనల్లోకి మనల్ని చలింపచేస్తాయ్ ఈ కథల్ని చదివేవారు ప్రతి కథను మనసుపెట్టి చదవండి పూర్తిగా చదవండి, చదవడం మొదలెడితే కథలన్నీ పూర్తయేదాకా వదలరు లెండి... మీకేది అనిపిస్తే అదే నిజం అనుకోండి... కథల్లా అగుపించినా! వాస్తవాలై కనిపించినా! ఏదైనా సరే! మనల్ని కదిలించక కుదిపించక మానవని తెలుసుకోండి. 'చలనం'లోని కథలన్నీ అలజడిని రేపుతాయ్ మనలో స్పందనని, ప్రతిస్పందనని ప్రతిధ్వనింప చేస్తాయ్ చివరికి ఓ 'సో కాల్డ్' ఓ మర్యాదస్తులనబడే వారినుంచి అన్లిమిటెడ్ తిట్లనో, బాధపడే వేదన, ఆవేదన చెందేవారి నుంచి అనేకానేక గాఢ నిట్టూర్పులనో విడుదల చేస్తాయ్ - డి. శ్యామల CHALANAM