
CHALAVA MIRIYAALU
₹90
In stock · 56 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
శ్రీ తల్లావఝుల శివశంకర శాస్త్రిగారు నందనోద్యానానికైనా, చంద్రికా ప్రసారమూ, హిమానీచర్చ ఉంటేనేగాని, విహరించాలని వచ్చే దేవమిధునాలకి కులాసా ఉండదు. తరతరాలుగా ఎంతమంది నవరస రసికు లుదయిస్తున్నా, రాజశేఖర కవిరాజు కావ్యమీమాంసలోని కల్పనతో, కవితా వధూటి నవోఢగా మారిపోయింది... అయినా అదేమి పాపమో... ఆ నిత్య యౌవనమూర్తి... ఆ ఏకపత్నీవ్రత దుఃఖశీల... కవిసార్వభౌమాదుల లాలనలో సామరస్యం చవి చూసిందవుటచేత... కవి, రాజతుల్యులయిన ప్రియంభావుకు లెవరు దరిజేరినా... విశృంఖల వృత్తితో... హృదయంగమరీతిని ఆదరిస్తూనే ఉన్నది, సామాన్యరీతిని... సాత్త్విక, సాంత్వన భావానురోఢంగా దక్షిణ నాయికావైదగ్ధ్యక్రమ మలవరచుకొన్నా... భావిభాగ్యఫల విభావాంతరాలు మాత్రం... మనోహరములై... క్షేమేంద్రాది మహాకవుల ఔచిత్య విచార చర్చలకు అవకాశము కల్పించేవై యున్నవి. కాని, ఎంతకాలము గడచినా... కావ్య ప్రపంచంలో ఎన్ని మార్పులు కలిగినా... 'వాణి నా రాణి'... అనే ధోరణిలో, కవితాకన్యను తన సొత్తుగా చేసుకుని అవిచ్ఛిన్నంగా ఉపభోగాల్ని అనుభవించే మహానుభావులు ఉదయించలేదు... లేరేమో కూడాన్ను నిజమే..., కావ్యాలంకరణజ్ఞమేవ... వృణీతే స్వయమ్... అయినా, లోకగతిలో భేదంతో రుచిభేదం వాటిల్లి 'స్వైరవిహారధీర'గా తయారుకావడంలేదు... ఆ కన్య? సాహిత్య ప్రపంచంలో... క్రొత్తరీతులకు ద్రోవచూపించింది... క్రొత్త రుచులు ఎరిగించింది... కవితా కన్యను... మనోహరంగా... వింతగా... చూడముచ్చటగా... అలంకరించింది, ఆమెకు క్రొత్త పోకడలు నేర్పింది... నవకవులందరిలోకీ తొలుదొల్త శ్రీ శివశంకరశాస్త్రిగారే... ఆయన చూపని సులభోపాయం లేదు. కావ్యరచనా విధానానికి, అవుననకపోయినా, అనుకరించని, ఆధునికులూ లేరు... శ్రీ శివశంకర శాస్త్రిగారు, నిర్వాహకత్వం వహించకముందు తెలుగు వాళ్ళకి 'సాహితి' లాటి పత్రిక లేదు... ఆయన దోవలు తీర్చిదిద్ది, పోకడలు చూపించకముందు... జాను తెనుగులో... బాల సరస్వతి రంగ కౌముదిలో చెప్పినట్లు... తెలుగుపస, తెలుగు నుడికారం, మెరసి పోయేటట్టు, మధుమధురమైన రచనలు, ఈనాటి వారిని, మనవాళ్ళు కన నోచుకోలేదు. చిగురుకు, సాహితీ సమితి సభ్యులు ప్రచారంలోనికి తీసుకురాకముందు, జవ ఉన్న తేట తెలుగులో, పసందైన నాజూకు పోకడలలో, మనోహరంగా ఉన్న ఒక్క చిన్న కధ, ఒక్కటి చాలును, అంతఃపూర్వము ఉన్న తెలుగు పత్రికలలో లేదు, ఈ శుభోదయము... రాను రాను బాహుళ్యాన విషాదాంతమౌతుందేమోనని భ్రమ... ఈ నవ్యభావ, విజ్ఞాన, రచనా విధానోదయానికి ధృవతార శ్రీ శాస్త్రిగారు. ఇది అంతా ఆయన చలువ. సాహితీ సమితి సభ్యులు, వాళ్ళ సమ్రాట్ సభాధిపతీ చూపించిన మెళకువలూ పోకడలూ ఆధునిక అగస్త్యానుజన్ములు అనుకరించే తాఖత్ లేక, ఆలంబనమూ,