
CHANDAMAMALU -150
₹150
In stock · 13 available
PublisherMATTI MUDRANALU
LanguageTelugu
chandamamalu మునాసు వెంకట్ కవిత్వం ప్రధానంగా దృశ్యశ్రవణ సమ్మిశ్రమం. ఈ తెలంగాణ ముద్దుబిడ్డ పాంచ భౌతిక కవి. పంచేంద్రియాల ఉచ్ఛాటన స్వాభావికంగా తెలిసినవాడు కావడం వలన ఇతని కవిత్వం ఆసాంతం ఇంద్రియోత్తుంగ తరంగమై పాఠకుల్ని చుట్టుముడుతుంది. ఆరని జ్వాలై అల్లుకుంటుంది. ఉబికే నీట ముంచెత్తుతుంది. చిరుగాలిలా ముద్దాడుతుంది. సుడిగాలిలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. భూమై లాలిస్తుంది. నీలాకాశమై వర్షించి సేదతీరుస్తుంది. దుఃఖ భారంతో వివశులైన వారికి 'రేలగంధం' పూసి ఓదార్పునిస్తున్నాడు. నేటివ్ ఇమేజరీతో కవి ఈ అసాధ్యాలను అలవోకగా సుసాధ్యం చేశాడు. మునాసు వెంకట్ ప్రాథమికంగా ప్రాకృతిక కవి. అతని అంతరమంతా అంజనకేళి. అంబటి సురేంద్రరాజు మునాసు కవిత్వం, పాఠకునిగా నాకు అనుభవమే, అదెప్పటికీ నాలో పచ్చగా తడిగానే లోపల కెరలుతూ వుంటుంది. ఇటువంటి కవిత్వానికి రససిద్ధి పొందిన పాఠకుడే కవి. అతనికి, వృత్తిలోని విభ్రమనే కానుకగా ఇస్తుంది ప్రకృతి. తెలుగు కవిత్వ Biopic లోని జీవకవులైన కవులూ, పాఠక కవుల సంత్ సూఫీ ఫకీర్ల నిశ్శబ్ద స్పర్శ ఉంది. వారిని చూస్తూ చందమామలని సమీపించాలి. ఆత్మ తనను తాను చూసుకుంటూ మలిపేసుకుంటూ, పై పొలుసుల్ని రాల్చుకుంటూ ఖాళీగా తయారయితే అచ్చమయిన దేశీ సారంగి సంగీతాన్ని వినొచ్చు చందమామల్లో. - సిద్ధార్థ